Advertisement
Google Ads BL

చీప్ టాపిక్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్


చీప్ టాపిక్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ఎక్కడ పాలిటిక్స్ లో ఎదిగిపోయి జనసేన పార్టీతో గెలిచి సీఎం పదవి కొట్టేస్తారో అని చాలామంది వైసిపీ నేతలు కడుపు రగిలిపోతుంది. చంద్రబాబు, బిజెపి తో పొత్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దత్త పుత్రుడిగా మారడంటూ ఆయనపై విరుచుకుపడే వైసిపీ మంత్రులు, నేతలు ఆయన పెళ్లిళ్ల విషయంలో మరింతగా దిగజేరిపోయి మాట్లాడతారు. సీఎం హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ప్రశ్నిస్తారు. అసలు ఒకరి వ్యక్తిగత విషయాలని బజారున పెట్టే హక్కు ఎవరికీ లేదు. కానీ వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, మాట్లాడితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం కెలుకుతారు.

Advertisement
CJ Advs

వైసీపీకి కొమ్ముకాస్తూ వైసిపికి భజన చేసే ఓ టాప్ వెబ్ సైట్ ఓ జోక్ వేసింది. అది చూసిన ఏపీ ప్రజలు పడి పడి నవ్వుకుంటున్నారు. అదేమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలయ్య హోస్ట్ గా వస్తున్న అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా త్రివిక్రమ్ తో కలిసి రాబోతున్నారు. బాలయ్య-పవన్ కలిస్తేనే చాలు ఫాన్స్ వీరంగానికి హద్దులు ఉండవు. కానీ ఇప్పుడు ఒకే స్టేజ్ కనిపించడం చాలా అరుదుగా జరిగే విషయం. ఈ షోలో పవన్ పర్సనల్ విషయాలతో పాటుగా, ఆయన పొలిటికల్ విషయాలు, కెరీర్ ప్లాన్స్ అన్ని ఆహా వారు బాలయ్యతో ఎలా అడిగిస్తారో అనే క్యూరియాసిటీ జనాల్లో ఉంది.

కానీ సదరు వెబ్ సైట్ వారు ఈ NBK అన్ స్టాపబుల్ టాక్ షోలో పవన్ కళ్యాణ్ బాలయ్య ని ఓ రిక్వెస్ట్ చేసారు, అది తన మూడు పెళ్లిళ్లు, తన భార్యల ప్రస్తావన ఆహా స్టేజ్ పై తీసుకురావొద్దని.. బాలకృష్ణ ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసారనే సమాచారం తమ వద్ద ఉన్నట్టుగా పోస్ట్ పెట్టారు. నిజంగా ఇది నవ్వుకోవాల్సిన జోక్ అంటున్నారు పవన్ ఫాన్స్. పవన్ రిక్వెస్ట్ పెడితే గిడితే అల్లు అరవింద్ కి పెట్టి ఇలాంటి ప్రశ్నలు వెయ్యొద్దని చెబుతారు కానీ.. బాలయ్యని అడగాల్సిన పరిస్థితి ఆయనకి లేదు అంటూ జనసైనికులు సదరు వెబ్ సైట్ పై ఫైర్ అవుతున్నారు. కొందరు ఆంధ్ర పాలిటిక్స్ లో చీప్ టాపిక్ అంటూ తేల్చేస్తున్నారు.

Cheap Topic in Andhra Politics:

Pawan kalyan to attend Balakrishna Unstoppable 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs