శ్రీలీల ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో మార్మోగిపోతున్న పేరు. పెళ్లి సందడి సినిమాలో ఎంత బ్యూటిఫుల్ గా ట్రెడిషనల్ గా కనబడిందో అప్పుడే తెలుగు ప్రేక్షకులు శ్రీలీలకి కనెక్ట్ అయ్యిపోయారు. అందుకే దర్శకనిర్మాతలు శ్రీలీల వెంట పడుతున్నారు. ఆ సినిమా హిట్ కాకపోయినా ధమాకా ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. రీసెంట్ గా రిలీజ్ అయిన ధమాకాలో శ్రీలీల లుక్స్ విషయంలో ప్రేక్షకులు మరింతగా ఆకర్షితులయ్యారు. ధమాకా ప్లస్ పాయింట్స్ లో శ్రీలీల అందాల గురించే ప్రస్తావిస్తున్నారు. రవితేజ ఎనేర్జికి శ్రీలీల బ్యూటిఫుల్ లుక్స్ మ్యాచ్ అయ్యాయి అంటూ ఆడియన్స్ ఘంటాపదంతో చెబుతున్న మాట.
సినిమా సో సో గా ఉన్నా శ్రీలీల అందాల కోసం ఓసారి ధమాకా వాచ్ చెయ్యొచ్చుగా అంటున్నారు. కథలో బలం లేదు, రొటీన్ ప్లాట్ అయినప్పటికీ.. థియేటర్స్ లో జనం విజిల్స్, కేకలు వినిపిస్తున్నాయంటే కేవలం శ్రీలీల గ్లామర్ షో నే, ఆమె రవితేజ తో సరిపాటుగా పెరఫార్మెన్స్ చెయ్యడం, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోవడంతో ధమాకాకి ఈ మాత్రం రెస్పాన్స్ దక్కింది అంటూ అందరూ ఓపెన్ గా చెబుతున్న మాట. ధమాకాకి ఏ టాక్ వస్తేనేమి శ్రీలీల పేరు మాత్రం ప్రస్తుతం మార్మోగిపోతోంది.
ధమాకా షో రాకముందే శ్రీలీల చేతిలో యంగ్ హీరోల ప్రాజెక్ట్ లు అరడజను ఉన్నాయి. ధమాకా పోయినా పాప కి పెద్దగా ఫికర్ అయితే పడదు. ఒకవేళ ధమాకా హిట్ అయ్యింది అంటే మరింతగా శ్రీలీల దూసుకుపోయేది.. ఇప్పటికి పెద్ద నష్టమేం లేదు.. అమ్మడు ఫ్యూచర్ మాములుగా లేదుగా..