Advertisement
Google Ads BL

అర్జున్ రామ్ పాల్ ప్లేస్ లో బాబీ డియోల్


క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం హరి హర వీర మల్లు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ పాన్ ఇండియన్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అర్జున్ రామ్ పాల్ పవన్ కళ్యాణ్ కి విలన్ గా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా నటిస్తాడని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అర్జున్ రామ్ పాల్ హరి హర వీరమల్లు నుండి తప్పుకున్నారు. ఆయన ప్లేస్ లోకి బాలీవుడ్ నుండి మరో నటుడు దిగారు. 

Advertisement
CJ Advs

ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ నేడు హరి హర వీరమల్లు చిత్ర బృందంలో అధికారికంగా చేరారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.

హరి హర వీర మల్లు చిత్ర యూనిట్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో 40 రోజుల పాటు 900 మంది సిబ్బందితో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ను ముగించారు. 

Bobby Deol as Aurangzeb:

Bobby Deol comes on board for Hari Hara Veera Mallu, set to play the Mughal emperor Aurangzeb
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs