Advertisement
Google Ads BL

వరసగా మూడో దెబ్బ


ఈ ఏడాది హీరో రవితేజకి అస్సలు కలిసి రాలేదు. గత ఏడాది క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ కి ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టాడు. అంటే హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టలేదు, మూడు ప్లాప్స్ తో రవితేజ హ్యాట్రిక్ అందుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ఖిలాడీ తో డిసాస్టర్ చవి చూసిన రవితేజ ఇదే ఏడాది మిడిల్ లో రామ రావు ఆన్ డ్యూటీ తో బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్నాడు. సరే ధమాకా అయినా అతన్ని కాపాడుతుంది అనుకున్నాడు. ధమాకా రిజల్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నాడు.

Advertisement
CJ Advs

కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ధమాకా నిన్న శుక్రవారం క్రిష్టమస్ సందర్భంగా రిలీజ్ అయ్యింది. రవితేజ ధమాకా కి మొదటి షోకే ఆడియన్స్ నుండి ప్లాప్ టాక్ వచ్చేసింది. క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా, సినిమాలో ఏం లేదని తేల్చేసారు. రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రీలీల బ్యూటిఫుల్ లుక్స్, కెమెరా, మ్యూజిక్ తప్ప ధమాకాలో చెప్పుకోవడానికి ఏం లేవని, రొటీన్ ప్లాట్ తో అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తో.. పూర్ దర్శకత్వంతో, పాతబడిన కథతో ధమాకాని తీశారంటూ సోషల్ మీడియాలో పబ్లిక్ అభిప్రాయపడ్డారు.

రవితేజకి ధమాకా కూడా ప్లాప్ అందించినట్టే.. దీనితో వరసగా మూడు ప్లాప్ లతో రవితేజ హ్యాట్రిక్ కొట్టాడంటున్నారు. ఎంత ఎనర్జీ ఉన్నా.. కంటెంట్ బావుంటేనే కానీ.. లేదంటే ఆడియన్స్ ఇచ్చే రిజల్ట్ ఇలానే ఉంటుంది అంటున్నారు. ఇప్పటికైనా రవితేజ కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తే బావుంటుంది అనే సలహాలు పడేస్తున్నారు. 

Tollywood Top Hero Register Hat trick Flops:

Ravi Teja Register Hat trick Flops
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs