Advertisement
Google Ads BL

పాపం పూజ హెగ్డే


అందంతో అదరగొడుతూ అవకాశాలు అందుకుంటున్న బుట్ట బొమ్మకి 2022 లో షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఒకటా రెండా వరస గా నాలుగు షాక్ లు తగిలాయి. పాన్ ఇండియా హిట్ కొట్టి అన్ని భాషల్లో క్రేజీగా మారుదామనుకున్న పూజ హెగ్డే కి ప్రభాస్ రాధేశ్యామ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అసలు అది కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ఇక తమిళంలో స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసి అక్కడ జెండా పాతుదాం అనుకుంటే బీస్ట్ బీభత్సమైన షాక్ ఇచ్చింది. దెబ్బకి పాప కి మైండ్ బ్లాంక్ అయ్యింది.

Advertisement
CJ Advs

అదే వరసలో పూజ హెగ్డే కి కొరటాల శివ ఆచార్య తో బిగ్గెస్ట్ డిసాస్టర్ ఇచ్చాడు. నీలాంబరిగా పూజ హెగ్డే కి ఆచార్య మరో షాక్. సరే ఇన్ని పోయినా.. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అయినా తనని ఆదుకుంటాడు, ఇక బాలీవుడ్ లో మనదే రాజ్యం అనుకున్న ఈ ముద్దగుమ్మకి రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కస్ కోలుకోలేని షాకిచ్చింది. ఈ క్రిష్ట్మస్ కి విడుదలైన సర్కస్ మూవీ పూజ హెగ్డే కి నీళ్లు తాగించింది. రోహిత్ శెట్టి కెరీర్ లోనే సర్కార్ బిగ్గెస్ట్ డిసాస్టర్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. సర్కస్ కి క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూస్ చూస్తే అయ్య బాబోయ్ ఇంత దారుణమా అంటారు.

రన్వీర్ సింగ్-రోహిత్ శెట్టి లకి సర్కార్ చెత్త రికార్డ్ ని అంటగట్టింది అంటున్నారు. సర్కస్ రిజల్ట్ తో పూజ హెగ్డే ఇప్పట్లో కోలుకోలేదు. ఈ ఏడాది పూజ హెగ్డే కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు డిజాస్టర్స్ తగిలాయి. అందుకే పాపం పూజ హెగ్డే అనేది. ప్రస్తుతం పూజ హెగ్డే కి తెలుగులో మహేష్ SSMB28, బాలీవుడ్ లో సల్మాన్ తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ రెండు పెద్ద చిత్రాలు చేతిలో ఉన్నాయి.

Pooja Hegde The New Iron Leg In The Industry:

Cirkus Concludes Worst Year For Pooja Hegde
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs