తమిళంలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన లవ్ టుడే మూవీ అక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. స్మార్ట్ ఫోన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇవానా హీరోయిన్ గా కనిపించగా రాధికా, సత్యరాజ్ లు కీలక పాత్రల్లో కనిపించారు. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన లవ్ టుడే తెలుగు హక్కులని హడావిడిగా కొనేసి దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెల నవంబర్ లో రిలీజ్ చేసారు.
ఇక్కడ తెలుగు ప్రేక్షకులని కూడా లవ్ టుడే విశేషంగా ఆకట్టుకుంది. దానితో దిల్ రాజుకి లాభాలే లాభాలు. థియేటర్స్ లో హిట్ అయిన లవ్ టుడే తమిళంలో డిసెంబర్ మొదటి వారంలోనే ఓటిటిలో విడుదలకగా.. తెలుగులో నెట్ ఫ్లిక్స్ నుండి ఈ రోజు అంటే డిసెంబర్ 23 న సైలెంట్ గా రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ నుండి లవ్ టుడే రిలీజ్ అని కూడా ఆడియన్స్ కి తెలియదు. ఇంత హిట్ సినిమా ఎలాంటి హడావిడి లేకుండా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
గత రాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. మరి థియేటర్లలో హిట్ అయినట్టుగా లవ్ టుడే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.