Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ని సీఎంని చెయ్యండి: ప్రజల డిమాండ్


ఇప్పటివరకు ఏపీలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సీఎం ని చెయ్యమని కొందరు తెలుగు త్మముళ్ళు, వైసీపీ మంత్రులు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తుంటే.. ఇప్పుడు తెలంగాణ నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని సీఎం ని చెయ్యమని చంద్రబాబు ని డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు మామ చంద్రబాబు కోసం రాజకీయాల్లోకి దిగి ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాలకి దూరంగా సినిమాలకి దగ్గరగా ఉంటున్నాడు. తన సినిమాలేవో తాను చేసుకుంటున్నాడు తప్ప రాజకీయాలవైపు కన్నెత్తి చూడడం లేదు.

Advertisement
CJ Advs

కానీ సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా ఎన్టీఆర్ సీఎం కావాలని చాలామంది బలంగా కోరుకుంటున్నారు. తాజాగా తెలంగాణ టీఆరెస్ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని, చంద్రబాబు, లోకేష్ సీఎం అవ్వాలనుకుంటున్నారు.. కానీ టీడీపీకి అసలు వారసుడు ఎన్టీఆర్ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో సైలెంట్ గా ఉంటూ ఉన్నట్టుండి ఖమ్మంలో ఓ సభ నిర్వహించి వివిధ పార్టీల్లో చేరిన తెలుగు తమ్ముళ్లు వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ఇలా స్పందించారు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్‌దని అన్నారు. కానీ ప్రజలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు, మామ ఎన్టీఆర్ పై చంద్రబాబుకి ప్రేమే ఉంటే ఏపీలో ఎన్టీఆర్ ని సీఎం ని చెయ్యమని సవాల్ విసిరారు.

Errabelli Comments On NTR:

People of AP want Jr. NTR… not Lokesh: Errabelli Dayakar rao
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs