Advertisement
Google Ads BL

ట్రెండీ లుక్ లో మరింత క్యూట్ గా మహేష్ డాటర్


సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార. చిన్న వయసు నుండే సోషల్ మీడియాలో స్టార్ కిడ్ గా ఫెమస్ అవడమే కాదు.. యువరాణిగా మారిన సితార డాన్స్, కూచిపూడి, యూట్యూబ్ వీడియోస్ తో తెగ ఫెమస్ అయ్యింది. మల్టీ టాలెంటెడ్ సితార ఇప్పుడు ప్రొఫెషనల్ మోడల్ లా అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో అదరగొట్టేలా చేసిన ఫోటో షూట్ చేసింది. ఆ షూట్ చూస్తే సితార తల్లి, తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది అంటారు. నమ్రత మోడలింగ్ నుండి మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుని నటనలో సత్తా చాటింది. మహేష్ మిస్టర్ ఇండియాగా అందగాడిగా రఫ్ అడిస్తున్నాడు. అంత అందమైన, టాలెంటెడ్ తల్లితండ్రులకి అందమైన సితార పుట్టడం మాములు విషయమే.

Advertisement
CJ Advs

సితార కూడా కూచిపూడి డాన్స్ తో సాంప్రదాయ బద్దంగా ముద్దుగా ఆకట్టుకుంది. అంతలోనే మోడరన్ లుక్ లోకి మారిపోయింది. తండ్రి మహేష్ బాబు తో కలిసి జీ ఛానల్ యాడ్స్ లో నటించడం, డాన్స్ షోకి గెస్ట్ గా హాజరై మెస్మరైజ్ చేసింది, నమ్రత నటనకు దూరమైనా మోడరన్ మమ్మీగా పిల్లలకి రోల్ మోడల్ గా నిలుస్తుంది. తాజాగా సితార మోడ్రెన్ గా క్యూట్ గా మెస్మరైజ్ చేస్తూ దిగిన ఫోటో షూట్ చూసిన అభిమానులు మహేష్ బాబు నట వారసత్వాన్ని మాత్రం నిలబెడుతుంది అంటూ పొగిడేస్తున్నారు. సితార లేటెస్ట్ ట్రెండీ ఫోటో షూట్ ని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక్క నిమిషం సితారేనా అనిపించేలా మెస్మరైజ్ చేసింది.

సితార బ్యూటిఫుల్ స్వీట్ అండ్ క్యూట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మహేష్ ఇక గుండెల మీద చెయ్యేసుకో.. నీ నట వారసత్వం సితార నిలబెడుతుంది అంటూ మహేష్ ఫాన్స్ అప్పుడే హడావిడి మొదలు పెట్టేసారు.

Mahesh Babu daughter Sitara latest photo shoot:

Mahesh Babu Daughter Sitara Ghattamaneni New look viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs