Advertisement

హీరో నాగార్జునకి గోవా గవర్నమెంట్ నోటీసులు


హీరో నాగార్జున సమస్యల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటున్న నాగార్జునకి గోవా ప్రభుత్వం నోటిసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.  గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద అక్కినేని నాగార్జునకి సర్పంచ్ అమిత్ సావంత్ జారీ చేసారు. నాగార్జున కి నోటీసు లు ఇవ్వడానికి కారణం ఏమిటంటే.. నార్త్ గోవా లో పపౌలర్ బీచ్ దగ్గర అశ్వెవాడ గ్రామ పరిధిలో నాగార్జున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఆ నిర్మాణ పనులని నాగార్జున వెంటనే నిలిపివేయాలని మండ్రెమ్ పంచాయతీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది.

Advertisement

గోవా ప్రభుత్వ అనుమతులు లేకుండా నాగార్జున.. నార్త్ గోవాలోని పాప్యులర్ విలేజ్ అయిన మాండ్రమ్‌లో ఓ రెసిడెన్షియల్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టు చేపట్టారు. కానీ అనుమతులు ఉందట చూపించాలని, లేదంటే నిర్మాణ ఆపనులని వెంటనే ఆపెయ్యలాని, ఆయన హీరో నా లేదంటే వేరేవారా అనేది తమకి తెలియదని, తాము చట్టబద్ధంగా కట్టే నిర్మాణాలకు వ్యతిరేకం కాదని సర్పంచ్ అమిత్ సావంత్ చెప్పారు.

రష్యా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ బీచ్ లో రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టి దానిని నాగార్జున కమర్షియల్ గా మార్చాలనుకున్నారని తెలుస్తుంది. మరి నోటీసులు అందుకున్న నాగార్జున ఎలా స్పందిస్తారో.. చూడాలి.

Goa panchayat issues notice to actor Nagarjuna:

Nagarjuna issued notice over alleged illegal construction work
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement