Advertisement
Google Ads BL

తుఫాన్ కి ముందు ప్రశాంతత: అడివి శేష్


మేజర్ తో పాన్ ఇండియా భాషల్లో అద్భుతమైన విజయ సాధించిన యంగ్ హీరో అడివి శేష్.. ఇప్పుడు హిట్ 2 తో సూపర్ హిట్ కొట్టాడు. నాని నిర్మాతగా డిసెంబర్ 2 న థియేటర్స్ లోకి వచ్చిన హిట్ 2 సూపర్ హిట్ అవ్వగా అడివి శేష్ KD గా అదరగొట్టేసాడు. మేజర్ మూవీలో అడివి శేష్ నటనను, హిట్ 2 లో అడివి శేష్ నటనను పొగడని వారే లేరు. అయితే అడివి శేష్ చేసే సినిమాలన్నీ ఇలా ఒకే తరహా కథలు కావడంతో ఆయన అభిమానులు అడివి శేష్ ని జోనర్ మార్చమని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

మరి అడివి శేష్ నుండి రాబోయే తదుపరి చిత్రం ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ కూడా ప్రేక్షకుల్లో మొదలైంది. ఆ గూఢచారి 2 మొదలు పెడతాడా.. కొత్త తరహా కథతో కొత్త సినిమాని ప్రకటిస్తాడో చూద్దామనుకునేలోపు.. అడివి శేష్ సోషల్ మీడియాలో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. తుఫానుకు ముందు ప్రశాంతత, కొత్త ప్రాజెక్ట్ తో తుఫాన్ త్వరలోనే వస్తుంది అంటూ అడివి శేష్ The #Calm Before the #Storm Hurricane coming soon with a new Project announcement ❤️ ట్వీట్ చేసాడు.

మరి అడివి శేష్ ప్రకటించబోయే ఆ కొత్త ప్రాజెక్ట్ పై అందరిలో ఆశక్తి మొదలయ్యింది. ఈసారి ఏ లవ్ బాయ్ గానో, ఫ్యామిలీ మ్యాన్ గానో అడివి శేష్ రావాలనే అభిమానుల కోరిక అడివి శేష్ తీరుస్తాడేమో చూద్దాం.

Adivi Sesh new project details soon:

Adivi Sesh tweet goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs