Advertisement
Google Ads BL

చరణ్ తో మూవీ.. బుచ్చిబాబు పంట పండింది


ఉప్పెన తో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా మారిన బుచ్చిబాబు సానా తన తదుపరి ప్రాజెక్ట్ స్టార్ హీరోతో చెయ్యాలని ఫిక్స్ అయ్యి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి స్టోరీ లైన్ చెప్పి ఒప్పించేసాడు. కానీ ఎన్టీఆర్ మరో రెండుమూడేళ్లు ఫ్రీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో బుచ్చిబాబు.. గురువు సుకుమార్ ని పట్టుకుని మెగా హీరో రామ్ చరణ్ తో మూవీకి శ్రీకారం చుట్టాడు, కథని కమిట్ చేయించడమే కాదు, పూజా కార్యక్రమాలతో సినిమాని మొదలు పెట్టేసాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ 100 కోట్ల రెమ్యునరేషన్ తో పాటుగా.. లాభాల్లో వాటా కూడా అందుకోబోతున్నాడట. మరోపక్క బుచ్చి బాబుకి రామ్ చరణ్ తో మూవీ చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. ఇప్పుడు బుచ్చి బాబు ఈ సినిమా కోసం ఏకంగా 20 కోట్ల పారితోషకం అందుకోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో 2023 లో మొదలు కాబోతుంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ప్రస్తుతం బుచ్చి బాబు హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక చేపట్టినట్లుగా తెలుస్తుంది. 

ఇక బుచ్చిబాబు రెండో సినిమాకే ఈ రేంజ్ పారితోషకం అందుకోవడం నిజంగా ఓ రికార్డ్ అనే చెప్పాలి.

Record Remuneration for Buchi Babu for Ram Charan movie:

Director Buchi Babu Remuneration For Movie With Ram Charan Is Huge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs