Advertisement
Google Ads BL

మహేష్ కి నమ్రత కండిషన్


మహేష్ ని ప్రేమించి పెళ్లాడిన నమ్రతకి పెళ్ళికి ముందు ఘట్టమనేని కోడలిగా అడుగుపెట్టాలంటే నటనకు దూరమవ్వాలనే ఓ కండిషన్ పెట్టారట మహేష్. మహేష్ ని ప్రేమించిన నమ్రత మహేష్ ని వదులుకోవడం ఇష్టం లేక మారుమాట్లాడకుండా నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి మహేష్ ని వివాహం చేసుకుని ఘట్టమనేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిందట. అయితే నటన వదిలేసినందుకు తనేం బాధపడడం లేదని చెప్పిన నమ్రత పెళ్ళికి ముందు ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్ని మహేష్ దగ్గరుండి పూర్తి చేయించి మరీ నమ్రతని పెళ్లాడాడట. ఈ విషయాలన్నీ నమ్రత ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

Advertisement
CJ Advs

మరి మహేష్ ఒక్కడే నమ్రతకి కండిషన్ పెట్టలేదు,  నమ్రత కూడా మహేష్ కి  ఓ కండిషన్ పెట్టిందట. అదే తాను ముంబైలో పెరిగాను, ఒకవేళ పెళ్లయ్యాక విశాలవంతమైన పెద్ద బంగాళాలో నివసించలేను అని చెప్పడంతోనే మహేష్ బాబు నమ్రత కండిషన్ కి ఒప్పుకుని అపార్ట్మెంట్ కి మారిపోయాడట. ఇక నటనను ఒదిలేసినందుకు బాధగా లేదని, ఒకవేళ నటనలో ఉంటే తన లైఫ్ డిఫరెంట్ గా ఉండేదని చెప్పింది.

అంతేకాకుండా తాను నటనలోకి రావడం అనేది తల్లి కోరిక అని, ఆమె కోరికని మేరకే మోడలింగ్ చేశాను అని, కెరీర్ ని సీరియస్ గా తీసుకుని ఉంటే మహేష్ ని పొందలేకపోయేదానిని అంటూ నమ్రత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Mahesh Babu wanted non-working wife: Namrata :

Namrata Shirodkar has opened up about the conditions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs