Advertisement
Google Ads BL

బాలయ్య కి మరో రియాలిటీ షో


నందమూరి బాలకృష్ణ టాక్ షో చెయ్యడమేమిటి అని పెదవి విరిచినవారికి సూపర్ డూపర్ షాకిస్తూ ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోని బ్లాక్ బస్టర్ హిట్ చేసారు బాలయ్య. ఆహా టాక్ షో లో బాలకృష్ణ అనర్గళంగా మాట్లాడకపోయినా అందరికి అర్ధమయ్యే రీతిలో వేసే పంచ్ లు, ఆయన కామెడీ టైమింగ్, అల్లరి అన్ని షోలో హైలెట్ అవుతున్నాయి. సెలెబ్రిటీ గెస్ట్ లు వస్తే ఎంత క్రేజ్ ఉంటుందో బాలయ్యకి ఆ షోలో అంతే క్రేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోకి బాలయ్యని హోస్ట్ గా తీసుకురావడానికి యాజమాన్యం సకల ప్రయత్నాలు చేస్తుందట.

Advertisement
CJ Advs

నాగార్జున గత నాలుగు సీజన్స్ ని హోస్ట్ చేస్తున్నారు. ఆయనకి బిగ్ బాస్ బోర్ కొట్టెయ్యడంతో సీజన్ 7 కి బై చెప్పేశారని అంటున్నారు. ముందు ఆయన ప్లేస్ లో రానాని అనుకున్నా ఆయన చెయ్యను అని చెప్పడంతో, ఇప్పుడు నాగ్ ప్లేస్ లోకి బాలయ్యని తీసుకువస్తే షో కి హైప్ క్రియేట్ అవుతుంది అని యాజమాన్యం బాలయ్య వెంటపడుతుందట. బాలకృష్ణ కి ఇప్పటికే ఓటిటి ఎంట్రీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు బుల్లితెర మీద వీకెండ్స్ లో రెండు గంటలు స్పెండ్ చేస్తే సరిపోతుంది అని ఆలోచనలో ఉన్నారట.

బిగ్ బాస్ సీజన్ 7 ని ఆల్మోస్ట్ బాలకృష్ణే హోస్ట్ చెయ్యొచ్చనే ఊహాగానాల నుండి ఆయనే హోస్ట్ , ఖచ్చితంగా ఇది ఫిక్స్ అనే వరకు వార్తలు సోషల్ మీడియాని కమ్మేశాయి.

Balakrishna to host Bigg Boss 7:

Nagarjuna quits As Bigg Boss Telugu 7 Host, Nandamuri Balakrishna To Replace Him Next Season
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs