Advertisement
Google Ads BL

షూటింగ్ లో జాయిన్ కానున్న సమంత


సమంత నటించిన యశోద ఈ మధ్యనే రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. పాన్ ఇండియా క్రేజ్ తో యశోద థియేటర్స్ లో సందడి చేసింది. సమంత మాయోసైటిస్ వ్యాధితో కొంతకాలంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. నీరసం, అలసట, కండరాలు పట్టెయ్యడం ఇంకా కొన్ని ప్రోబ్లెంస్ ని ఫేస్ చేస్తున్న సమంత యశోద ప్రమోషన్స్ లోను ప్రోపర్ గా పాల్గొనలేదు. ఓ ఇంటర్వ్యూ తో సరిపెట్టేసింది. ఈ మధ్యలో సమంత కి మాయోసైటిస్ ముదిరిపోయి ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది అంటూ వార్తలు రావడం, ఆమె మేనేజర్ వాటిని ఖండించడం చూసాం. అయితే ప్రస్తుతం సమంత హెల్త్ కండిషన్ విషయంలో ఎలాంటి న్యూస్ లేకపోయేసరికి ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.

Advertisement
CJ Advs

మరోపక్క సమంత చేస్తున్న సినిమాలు ఆమె చేతినుండి చేజారిపోయాయని, కాదు ఆమె ఆ ప్రాజెక్ట్ ల నుండి తప్పుకుంది అనే ప్రచారం మొదలు కాగా.. సామ్ మేనేజర్ ఎప్పటిలాగే ఆ వార్తలని ఖండిస్తూ సమంత చేతిలో ఉన్న ఏ సినిమా వదులుకోలేదు, ప్రస్తుతం సమంత విశ్రాంతి తీసుకున్నారు, సంక్రాంతి పండగ తర్వాత ఆమె శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఖుషి షూటింగ్ లో పాల్గొంటారని ఆ తర్వాత ఆమె బాలీవుడ్ నటించాల్సిన సినిమాలో పాల్గొంటుంది అంటూ చెప్పాడు.

అసలైతే సమంత నటించాల్సిన వరుణ్ ధావన్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కాల్సిన మూవీ జనవరిలోనే మొదలు కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మొదలు కావడానికి ఆరు నెల‌లు ఆలస్య‌మవుతుంది. దీంతో మే నుంచి ఆ సినిమా షూటింగ్ లో సమంత పాల్గొంటారు. స‌మంత ఒప్పుకున్న ఏ ప్రాజెక్ట్ నుంచి ఆమె వెళ్లిపోవ‌టం లేదు. ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తున్నారు. అయితే సమంత కొత్త ప్రాజెక్టుల‌ను ఓకే చేయ‌టం లేదు అంటూ ఆమె మేనేజర్ హెల్త్ స్టేటస్ తో పాటుగా సమంత నటించాల్సిన సినిమాల అప్ డేట్స్ ఇచ్చాడు.

Samantha will join the shooting:

Has Samantha Ruth Prabhu opted out of her Bollywood film?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs