Advertisement
Google Ads BL

పవన్ ఫాన్స్ ఆశిస్తుంది జరిగేనా?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఫాన్స్ ఆశిస్తుంది ఓ అడుగు వెనక్కి వెళుతుంది కానీ సమయానికి మాత్రం జరగడం లేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలని ఎలాగో ఏడాది గ్యాప్ లో విడుదల చేసిన పవన్ ఇప్పుడు చెయ్యబోయే ప్రాజెక్ట్ లు ఎప్పుడు పూర్తి చేస్తారో క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. రాజకీయాల్లో బిజీగా అవుతున్న సమయంలో వీలు కుదిరినప్పుడు షూటింగ్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ నుండి ఎక్కువ ఆశించడం కూడా కరెక్ట్ కాదేమో అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. గత నెల నుండి హరి హర వీరమల్లు షూటింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మళ్ళి షూటింగ్ కి ఎప్పుడు బ్రేకులు వేస్తారో తెలియదు.

Advertisement
CJ Advs

అయితే హరి హరవీరమల్లుగా పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. వీరమల్లు గ్లిమ్ప్స్ కూడా ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీరమల్లు వర్క్ షాప్ లో పవన్ పాల్గొనడం అన్నీ ఆడియన్స్ కి నచ్చాయి. ఇప్పుడు డిసెంబర్ 30 న హరి హర వీరమల్లు నుండి స్పెషల్ గ్లిమ్ప్స్ విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తుంది. కానీ అది జరిగే పనేనా అనేది మాత్రం ఇంకా ఫాన్స్ కి క్లారిటీ రావడం లేదు. మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తేనే కాని ఫాన్స్ నమ్మేలా లేదు. ఆ గ్లిమ్ప్స్ కి సంబందించిన పనుల్లో క్రిష్ తలమునకలై ఉన్నాడట.

మరోపక్క డిసెంబర్ 31 పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషి రీ రిలీజ్ కాబోతుంది. ఒకవేళ హరి హర వీరమల్లు గ్లిమ్ప్స్ వస్తే.. ఖుషి అలాగే వీరమల్లు గ్లిమ్ప్స్ తో పవన్ ఫాన్స్ కి పండగే. 

Hari Hara Veera Mallu special glimpse on Dec 30:

Hari Hara Veera Mallu update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs