రవితేజ గత ఏడాది కరోనా సమయంలో డేర్ చేసి క్రాక్ ని థియేటర్స్ లో దింపినా.. సంక్రాంతికి ప్రేక్షకులు క్రాక్ ని మాస్ హిట్ చేసారు. క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ఈ ఏడాది మాత్రం ఖిలాడీ తో ఘోరమైన డిసాస్టర్ చవి చూసాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడీ డిసాస్టర్ అయ్యాక.. రవితేజ నుండి రామారావు ఆన్ డ్యూటీ వచ్చింది. కొత్త దర్శకుడు శరత్ కూడా రవితేజకి మరో డిసాస్టర్ అందించాడు. దానితో రవితేజ కి హిట్ అవసరం బాగా ఏర్పడింది. వరస ప్రాజెక్ట్స్ చేతిలో ఉంటే కాదు.. దమ్మున్న కథ కావాలంటున్నారు ఆడియన్స్.
మరి రేపు శుక్రవారం ధమాకాతో రవితేజ మ్యాజిక్ చెయ్యకపోతే ఆయనకి కష్టమే. ధమాకా తో కచ్చితంగా రవితేజ హిట్ కొట్టాల్సిందే. లేదంటే కష్టం సుమీ.. ధమాకాతో మాస్ మహారాజ్ హిట్ కొట్టకపోతే రవితేజ మార్కెట్ ఢమాల్ మనడం ఖాయం. ధమాకా ట్రైలర్, ప్రమోషన్స్ చూస్తే హిట్ కళ కనిపిస్తుంది. హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్స్, క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాపై ఆసక్తి కలుగుతుంది. ధమాకాకి కనీసం మిక్స్డ్ టాక్ పడినా సినిమాని హిట్ చెయ్యడం ఖాయం.
చూద్దాం ఈ ఏడాది చివరిలో రవితేజ హిట్ కొట్టి ఇండస్ట్రీకి ఊపు తీసుకువస్తాడేమో. అన్నట్టు వచ్చే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ తో కలిసి వాల్తేర్ వీరయ్యతో సందడి చెయ్యడానికి రెడీ అయ్యాడు. అదైతే హిట్ కళ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ధమాకాతో సేవ్ అయితే రవితేజ గట్టెక్కేసినట్టే. ఇంకా రవితేజ నుండి రావణాసుర, టైగర్ నాగేశ్వరరా పాన్ ఇండియా ప్రాజెక్ట్ రావాల్సి ఉంది.