కళ్యాణ్ దేవ్ ని మెగాస్టార్ చిన్నల్లుడు అనాలో మాజీ అల్లుడు అనాలో ఇప్పటికి క్లారిటీ లేదు. కానీ శ్రీజ-కళ్యాణ్ లు కలిసి మాత్రం ఉండడం లేదు. వాళ్ళిద్దరికీ విడాకులు అయ్యాయా అనే విషయంలో మెగా ఫ్యామిలీకి ఎక్కడా స్పందించలేదు. కళ్యాణ్ దేవ్ కూడా తాను పెట్టె పోస్ట్ ల్లో నిగూడ అర్ధాలుదాగి ఉంటాయి కానీ.. అది ఎవరికి అర్ధమే కాదు. ఇక చిరు ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలు చేసుకున్న కళ్యాణ్ దేవ్ గత ఏడాది నుండి సైలెంట్ గానే ఉంటున్నాడు.
శ్రీజ తో కలిసి ఉండకపోయినా కూతురు నివిష్కతో అప్పుడప్పుడు టైమ్ స్పెండ్ చేస్తున్న కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం తల్లితండ్రుల దగ్గరే ఉంటున్నాడు. నిత్యం జిమ్ లో కష్టపడుతూ బాడీని వర్కౌట్స్ తో ఫిట్ గా ఉంచుతున్నాడు. శ్రీజ మాత్రం కళ్యాణ్ దేవ్ నుండి విడిపోయాక ఫ్యామిలీ సపోర్ట్ తో ఆ బాధని మరిచిపోవడానికి వెకేషన్స్ అంటూ తిరుగుతుంది. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే కాస్త ఓపిక పట్టండి.. అన్నటికి సమాధానాలు దొరుకుతాయి అంటూ కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ పై అందరిలో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అంటే పర్సనల్ గా ఏదైనా న్యూస్ చెబుతాడా? లేదంటే కెరీర్ విషయాలను ఏమైనా రివీల్ చేస్తాడా? అసలు కళ్యాణ్ దేవ్ ఏం చెప్పాలనుకుంటున్నాడు.. శ్రీజా తో విడాకుల మేటర్ బయటపెడతాడా అనే ఆలోచనలతో సతమవుతున్నారు నెటిజెన్స్. కళ్యాణ్ ఇచ్చే ఆ సమాధానం కోసం సర్వత్రా వెయిటింగ్.