Advertisement
Google Ads BL

సొంత సినిమాని పట్టించుకోని నయన్


నయనతార ని ఎంత పారితోషకం ఇచ్చి సినిమాలో ఎంపిక చేసినా ఆమె సినిమాలో నటించేవరకు మాత్రమే తన పని, తర్వాత ప్రమోషన్స్ తో నాకేం పని లేదునట్టుగా బిహేవ్ చేస్తుంది తప్ప ఆమె మాత్రం సినిమాని ప్రమోట్ చెయ్యడానికి అస్సలు రాదు. అయితే సినిమాల ప్రమోషన్స్ కి రాకపోయినా అవార్డుల వేడుకకి మాత్రం నయనతార హాజరవుతుంది. సినిమాల ప్రమోషన్స్ కి రాకపోవడానికి తనకి సెంటిమెంట్ ఉంది అని చెబుతుంది. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఏదైనా సినిమా షూటింగ్ చేస్తుంది వెళ్ళిపోతుంది. మళ్ళీ కనబడదు. 

Advertisement
CJ Advs

రిలీజ్ కి ముందుకాని, తర్వాత కానీ ఇంకెప్పుడు నయన్ ఊసు ఉండదు. నయనతార నటించిన అన్ని సినిమాల లాగే ఆమె నటించిన కనెక్ట్ సినిమాని నయన్ పట్టించుకోలేదు. డిసెంబర్ 21 న కనెక్ట్ విడుదల కాబోతుంది. అంటే నయన్ నటించింది అనే కాదు.. తన భర్త విగ్నేష్ శివన్ నిర్మాణంలో తెరకెక్కింది. నయనతార-విగ్నేష్ శివన్ ల రౌడీ పిక్చర్స్ నిర్మాణం నుండి కనెక్ట్ విడుదల కాబోతుంది. సుమకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది తప్ప పబ్లిక్ లోకి రాలేదు. ఈ సినిమాకి రౌడీ పిక్చర్స్ వారు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు తప్ప ఇంకెక్కడా ఈ సినిమా ప్రమోషన్స్ లేవు. దర్శకుడు మాత్రం విడుదల అవుతున్న భాషల్లో ఇంటర్వూస్ ఇస్తూ.. పబ్లిక్ లో తిరుగుతున్నాడు.

పాన్ ఇండియా మూవీగా కనెక్ట్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకాబోతుంది. నయనతార మన సినిమానే కదా ప్రమోట్ చేస్తే మరింతగా జనాలకు కనెక్ట్ అయ్యి సినిమాకి వెళతారనే ఆలోచనే లేదు ఆవిడకి. మరి ఆవిడా సెంటిమెంట్ ఆవిడది, సొంత సినిమా అయినా, ఏ సినిమా అయినా ఒక్కటే కదా..

Nayanthara Is Out Promoting Her Film Connect:

Connect release on Dec 22
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs