బిగ్ బాస్ సీజన్ 6 సప్ప సప్పగా 15 వారాలు పూర్తి చేసుకుని ఈరోజు ఆదివారం గ్రాండ్ ఫినాలే తో ముగిసింది. రేవంత్ విన్నర్ గా సీజన్ 6 ట్రోఫీ అందుకున్నాడు. మొదటి నుండి సింగర్ రేవంత్ టైటిల్ ఫెవరెట్ గా ఉండడం.. చివరి వరకు ఆ స్ట్రాంగ్ నెస్ అతనికి బలాన్ని ఇవ్వడం అన్ని అతన్ని బిగ్ బాస్ విన్నర్ గా నిలబెట్టాయి అనుకోవడానికి లేకుండా శ్రీహన్ టాప్ 2 లో కాకుండా మధ్యలోనే 40 లక్షలతో మిడిల్ డ్రాప్ అవడంతో చివరికి రేవంత్ విన్నర్ అయ్యాడు తప్ప.. నాగార్జున స్టేజ్ పైకి తీసుకువచ్చి శ్రీహన్-రేవంత్ లలో రేవంత్ ని విన్నర్ గా ప్రకటించలేదు.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో ఉన్న టాప్ 5 మెంబెర్స్ లో ముందుగా రోహిత్ హౌస్ నుండీ ఎలిమినేట్ కాగా.. తర్వాత శ్రీలీల ఆది రెడ్డి పేరు చెప్పి ఎలిమినేట్ చేసింది. ఆ తర్వాత రవితేజ పది లక్షల సూట్ కేస్ తో రేవంత్-శ్రీహన్-కీర్తిలని టెంప్ట్ చేసినా ఎవ్వరూ సూట్ కేస్ తీసుకోలేదు. దానితో రవితేజ కీర్తిని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకువచ్చాడు. ఫైనల్ గా టాప్ 2 లో ఉన్న వారిని డైరెక్ట్ గా స్టేజ్ పైకి పిలవకుండా నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఇద్దరిలో ఎవరో ఒకరు 40 లక్షలు తీసుకుంటే మిగతా వారు విన్నర్ అవుతారని నాగ్ చెప్పడంతో శ్రీహన్ ఫ్రెండ్స్, పేరెంట్స్ అంతా శ్రీహన్ ని 40 లక్షల సూట్ కేస్ తీసుకోమనగానే శ్రీహన్ టైటిల్ రేస్ నుండి తప్పుకుని 40 లక్షల సూట్ కేస్ తీసుకోవడంతో రేవంత్ అలా విన్నర్ గా నిలిచాడు.
ప్రైజ్ మనీ అక్కర్లేదు ట్రోఫీ చాలు అన్నట్టుగా రేవంత్ బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీగా కేవలం 10 లక్షల క్యాష్, ఓ ప్లాట్, బ్రిజా కార్ అందుకున్నాడు. శ్రీహన్ మాత్రం 40 లక్షల క్యాష్ తో పాటుగా సువర్ణ భూమి నుండి ఓ ప్లాట్ అందుకుని విన్నర్ కన్నా ఎక్కువ అమౌంట్ అందుకుని రికార్డ్ సృష్టించాడు.,
సో శ్రీహన్ విన్నర్ రేస్ నుండి క్యాష్ కోసం మిడిల్ డ్రాప్ అవడంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. లేదంటే రేవంత్-శ్రీహన్ లలోఈ ఎవరో ఒకరు విన్నర్ అయ్యేవారు అనుకోవడానికి ఛాన్స్ లేదు.. ముందునుండి రేవంత్ కి వచ్చిన సపోర్ట్, క్రేజ్, ఓట్స్ అన్ని కలిపి రేవంత్ పక్కాగా విన్నర్ గా నిలిచేవాడు. కానీ శ్రీహన్ తెలివిగా 40 లక్షలు పట్టుకుపోయాడు.