రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ మంచి ఫ్రెండ్స్. కానీ వారి మధ్యన ఏదో ఉంది.. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు మీడియాలో ఒకటే గుసగుసలు వినిపిస్తుంటాయి. వారు మాత్రం మేము మంచి ఫ్రెండ్స్ మి మాత్రమే అంటారు. కానీ వెకేషన్స్ ని కలిసే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే రష్మిక-విజయ్ దేవరకొండ ఒకే చోట కలిసి ఉన్న స్టైలిష్ లుక్స్ కావు కానీ.. అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ నుండి విడివిడిగా ఒకేసారి ఆ లుక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యేసరికి అలా రష్మిక-విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్స్ అన్నమాట.
ఇంతకీ విజయ్ దేవరకొండ ఓ మ్యాగజైన్ కోసం చేయించుకున్న ఫోటో షూట్ అది. బజార్ మ్యాగజైన్ కోసం విజయ్ దేవరకొండ స్టైలిష్ ఫోటో షూట్ ఫైర్ పుట్టించేదిలా ఉంది. అంత హ్యాండ్ సమ్ లుక్ లో రౌడీ హీరో ఫాన్స్ లో ఫైర్ పుట్టించాడు. లైగర్ సినిమా డిసాస్టర్ తర్వాత సెరా యాడ్ లో కియారా తో కలిసి అదరగొట్టేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇలా మ్యాగజైన్ ఫోటో షూట్ లో కిర్రాక్ పుట్టించాడు.
రష్మిక మందన్న హిందీలో మిషన్ మజ్ను ప్రమోషన్స్ లో హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి గ్లామర్ గా స్టైలిష్ గా రెచ్చిపోతుంది. గుడ్ బై ప్రమోషన్స్ లోనే అందాలు ఆరబోసేసిన రష్మిక.. ఇప్పుడు గ్లామర్ లుక్ లో మెరిసిపోతుంది. గ్రాజియా ఇండియా మ్యాగజైన్ కోసం కోటు సూటు వేసుకుని మరీ దిగిపోయింది. An evening well spent… @GraziaIndia🤍 అంటూ రష్మిక ఇచ్చిన సూపర్ స్టైలిష్ లుక్ చూస్తే అబ్బా అదిరింది అంటారు.
మరి విడివిడిగానే ఫొటో షూట్స్ తో అభిమానులని సంతోషపెట్టిన రష్మిక అండ్ విజయ్ దేవరకొండ ల పిక్స్ ని మీరు ఓ లుక్కెయ్యండి.