Advertisement
Google Ads BL

చరణ్ వల్ల కానిది రవితేజ వల్ల అవుతుందా..


మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తో ఎంతో క్రేజీగా చేసిన ఆచార్య సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ గెస్ట్ గా ఆచార్య షూటింగ్ మొదలైనా.. చివరికి రామ్ చరణ్ పాత్ర నిడివి పెరిగిపోయింది. ఇంకేంటి తండ్రి కోడలు ఇద్దరూ బాక్సాఫీసుని షేక్ చేస్తారని అనుకున్నారు మెగా ఫాన్స్. మెగా ఫాన్స్ ఆశలు, అంచనాలు ఆచార్యతో తారుమారయ్యాయి. రామ్ చరణ్ ఆచార్య లో నటించడం వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ లేకపోగా.. సినిమాకొచ్చిన టాక్ ఫాన్స్ కి నీరసాన్ని తెప్పించింది. ఎందుకో సినిమా విడుదలకు ముందు కూడా ఆచార్య పై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. సిల్వర్ స్క్రీన్ పై తండ్రీకొడుకులుగా.. చరణ్-చిరు ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు రవితేజ వాల్తేర్ వీరయ్యలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ వీరయ్య పాత్రలో మాస్ గా దుమ్మురేపుతుంటే.. రవితేజ ACP గా స్టైలిష్ గా యాక్షన్ తో దుమ్మురేపుతున్నాడు. రవితేజ వలన వాల్తేర్ వీరయ్యకి చిరుకి ఎమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా.. ప్రస్తుతానికైతే సినిమాపై అంచనాలు బావున్నాయి. మెగాస్టార్ గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టారు, అలాగే రవితేజ కాంబో అన్ని సినిమాపై ఆసక్తిని అయితే కలిగిస్తున్నాయి. ఇప్పుడు రవితేజ నుండి రాబోతున్న ధమాకా గనక హిట్ అయితే వీరయ్యపై అంచనాలు మరింతగా పెరుగుతాయి.

ఆచార్య లో చరణ్ వల్ల కానిది వాల్తేర్ వీరయ్యలో రవితేజ వల్ల అవుతుందా.. రవితేజ-చిరు కలిసి హిట్ కొడతారా.. చూద్దాం ఏం జరుగుతుందో అనేది.. అది జనవరి 13 న తేలిపోతుంది.

What is not due to Charan will be due to Ravi Teja?:

Will Ravi Teja help Walther Veeraya?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs