Advertisement
Google Ads BL

సల్మాన్ పెళ్లి తర్వాత నా పెళ్ళానాలేమో: ప్రభాస్


ప్రభాస్-బాలకృష్ణ అన్ స్థాపబుల్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నిన్నటివరకు గ్లిమ్ప్స్ తో, పిక్స్ తోనే పిచ్చ హైప్ క్రియేట్ చేసిన అన్ స్టాపబుల్ టీమ్.. ఇప్పుడు ప్రోమోతో మరింతగా క్రేజ్ తీసుకొచ్చింది. ప్రభాస్ ఓ టాక్ షోలో ఎలా ఉంటారో అనే అనుమానాలను ఈ ప్రోమో తుడిచిపెట్టేసింది. ఉప్పలపాటి ప్రభాస్ రాజు కి స్వాగతం చెప్పిన బాలయ్య అంతే ఎనర్జిటిక్ గా నువ్ అందరిని డార్లింగ్ అంటావ్ నన్ను కూడా అలానే పిలవమనగానే ప్రభాస్ కూడా క్రేజీగా డార్లింగ్ సర్ అంటూ బాలయ్య ని హగ్ చేసుకున్న తీరు ఆడియన్స్ ని పడేసింది. 

Advertisement
CJ Advs

మొన్న శర్వానంద్ ఈ షోకి వచ్చినప్పుడు పెళ్ళెప్పుడు అంటే ప్రభాస్ పెళ్లి తర్వాత అన్నాడు.. అని బాలయ్య అనగానే, దానికి ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ నిజంగా ఫన్నీగా అనిపించింది. అప్పుడు నేను సల్మాన్ చేసుకున్నాక చేసుకుంటాను అనాలేమో అంటూ కామెడీ చేసాడు. ఇక బాలకృష్ణ ప్రభాస్ కెరీర్ విషయాలను, పర్సనల్ విషయాలను అడిగారు. ప్రభాస్ కూడా అంతే జోష్ లో సమాధానాలు ఇచ్చారు. కానీ ప్రభాస్ మాత్రం ఓ విషయంలో కాస్త భయపడినట్లుగా చెప్పాడు. అదే సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియాలో ఏం మాట్లాడితే ఏం రాస్తారో అనే భయాన్ని వ్యక్తం చెయ్యడం, చరణ్ నువ్ నా ఫ్రెండ్ వేనా అంటూ చరణ్ ని సరదాగా కోప్పడడం అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక గోపీచంద్ స్టేజ్ పైకి వచ్చాక ఆ ఫన్ మరింతగా పెరిగిపోయింది. చరణ్ కి ఫోన్ చేస్తే అని బాలయ్య అనగానే రాణి గురించి చెప్పాడా అన్నాడు గోపి. దానికి ప్రభాస్ అరేయ్ అంటూ గోపీచంద్ మీదకి వెళ్ళబోతే బాలయ్య ని అడ్డుపెట్టుకున్నాడు గోపీచంద్. ఇలా ప్రభాస్-గోపీచంద్ లు చేసిన అల్లరి బాలయ్య చేసిన సందడికి అన్ స్టాపబుల్ ప్రోమో ఓ రేంజ్లో అదిరిపోయింది. నిజంగా ప్రభాస్ చెప్పిన ప్రతి మాటని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈ ప్రోమో చివరిలో ప్రభాస్ పెదనాన్న కృష్ణరాజు గారు గురించి ప్రభాస్ ఎమోషనల్ అవ్వగా బాలయ్య ప్రేమగా ప్రభాస్ ని హాగ్ చేసుకున్నారు. ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

Unstoppable Baahubali episode promo out:

Unstoppable Baahubali episode date out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs