దిల్ రాజు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది అంటూ తెగ ఇదైపోతున్నారు. తాను ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని బిట్స్ మాత్రం వైరల్ చేస్తున్నారు. నేను ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నేను చెప్పను అంటూ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి తన గోడు వెళ్లబోసుకున్నారు. దిల్ రాజు తమిళ హీరోల్లో విజయ్ నెంబర్ వన్ అని తర్వాతే అజిత్ అని.. వచ్చే పొంగల్ కి విజయ్ వారిసు, అజిత్ తునీవు పోటీ పడుతున్నాయి. విజయ్ కి అజిత్ కి కోలీవుడ్ లో 800 ల థియేటర్స్ చెరో సగం అంటే 400 లు, 400 థియేటర్స్ ఇస్తామన్నారు.
కానీ విజయ్ స్టార్ హీరో కాబట్టే అతనికి 400 లు థియేటర్స్ తో పాటుగా ఓ 50 థియేటర్స్ ని పెంచమని తమిళనాట తునివుని విడుదల చేస్తోన్న ఉదయనిధి స్టాలిన్ ని కలిసి అడుగుదామనుకుంటున్నామంటూ దిల్ రాజు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అంతేకాదు విజయ్ - అజిత్ ఫాన్స్ మధ్య వార్ ని మరింత పెంచింది. ముఖ్యంగా తమ హీరోని తక్కువ చేస్తూ మాట్లాడడం పట్ల భగ్గుమన్న అజిత్ ఫాన్స్ దిల్ రాజు పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.
దానితో ఉలిక్కిపడ్డ దిల్ రాజు డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. తాను ఏం మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తున్నారు. అందుకే ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. నేను ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని ఎందుకు మాట్లాడతాను. ఆ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తిగా చూసి మట్లాడండి. సగం సగం కాదు అంటూ దిల్ రాజు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.