Advertisement
Google Ads BL

ఎవరైనా ఓకె కానీ రష్మిక వద్దురా సామి


NTR 30 మొదలు కావడానికి సమయం ఆసన్నమైంది. అతి త్వరలోనే NTR30 అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యుఎస్ ట్రిప్ లో ఉన్నారు. ఫ్యామిలీతో యుఎస్ ట్రిప్ ముగియగానే ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చి NTR30 సెట్స్ లోకి జాయిన్ అవుతారట. కొరటాల శివ పకడ్బందీగా NTR30 ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటుగా మ్యూజిక్ సిట్టింగ్ కూడా పూర్తి చేసేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ వేటలో కొరటాల తలమునకలై ఉన్నారు.

Advertisement
CJ Advs

అయితే కియారా అద్వానీ కానీ, లేదంటే రశ్మికని కానీ ఎన్టీఆర్ కో జోడిగా తెచ్చేందుకు కొరటాల చూస్తున్నారట. ఎన్టీఆర్ తోనూ హీరోయిన్ విషయమై చర్చించి కియారా అద్వానీతో సెట్స్ మీదకి వెళతారో.. లేదంటే రష్మిక తోనో అనేది క్లారిటీ వస్తుంది అనే న్యూస్ చూసిన ఓ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో.. ఎవరైనా ఓకె కానీ రష్మిక వద్దురా సామి అంటూ రిక్వెస్ట్ చేసింది. ఆ ప్రేక్షకురాలు చేసిన రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పుష్ప ప్రమోషన్స్ లో సామి, రారా సామి అంటూ ఆమె చేసిన ఓవరేక్షన్ చాలామందికి నచ్ఛలేదు. అందులోను ఇప్పుడు కన్నడ ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన రష్మికతో కలిసి ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభించడం కరెక్ట్ కాదు అనేది చాలామంది భావన. మరి కొరటాల ఆ అభిమాని రిక్వెస్ట్ ని పరిగణనలోకి తీసుకుంటారేమో చూడాలి.

Anyone is ok but not Rashmika:

NTR30 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs