Advertisement
Google Ads BL

అయ్యయ్యో పైరసీ బారిన అవతార్ 2


భారీ అంచనాలు నడుమ భారీగా రేపు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా క్రేజీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హాలీవుడ్ అవతార్ 2 పై ఎన్నో ఆశలు, అంచనాలు ఉన్నాయి. అవతార్ 2 కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 16 వేల కోట్ల టార్గెట్ తో బాక్సాఫీసు బరిలోకి దిగుతున్న ఈ మూవీపై ఫాన్స్ క్రేజీగా ఉన్నారు. మరికొద్ది గంటల్లోనే ఆడియన్స్ ముందుకు రావాల్సిన అవతార్ 2 పైరసీ బారిన పడడం కలకలం సృష్టించింది.

Advertisement
CJ Advs

భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ ఇలా పైరసీ బారిన పడడంతో మేకర్స్ షాక్ అవుతున్నారు. 

అవతార్ ద వే అఫ్ వాటర్ విడుదలకు ఒక్కరోజు ముందు టెలిగ్రామ్ లో ప్రత్యక్షమవడంతో కోట్లాదిమంది ఆడియన్స్ కంగారు పడుతున్నారు. భారీ బడ్జెట్ తో, భారీ విజువల్స్ తో తెరకెక్కిన అవతార్ ని 3D లో వీక్షించి ఎంజాయ్ చెయ్యాలనుకున్న అవతార్ అభిమానులు ఈ పైరసీ విషయం తెలిసి నిరాశకు లోనవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంటే పైరసీ రాయుళ్లు అవతార్ ని పైరసీ చెయ్యడం ఎవ్వరికీ నచ్చడం లేదు.

గత వారం రోజుల నుండి అవతార్ టికెట్స్ కోసం బుక్ మై షోలో మినీ యుద్ధమే జరుగుతుంది. టికెట్ బుకింగ్స్ లోనే రికార్డులు సృష్టించిన ఈ సినిమా కోసం కొన్ని కార్పొరేట్ ఆఫీస్ లు ప్రత్యేకగా టికెట్స్ ని బుక్ చేసి తమ ఎంప్లాయిస్ కి అందజెయ్యడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇంత క్రేజీగా ఎదురు చూస్తున్న సినిమా పైరసీ అవడం నిజంగా దురదృష్టకరమే.

James Cameron Avatar: The Way Of Water Leaked! :

Piracy of Avatar 2 in Telegram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs