బాలకృష్ణ పక్కన యంగ్ హీరోయిన్ శృతి హాసన్ తేలిపోతుంది అనుకుంటే.. శృతి హాసన్ తో పోటీగా యంగ్ లుక్స్ లో బాలయ్య ఇరగదీసేస్తున్నారు. ఇప్పటికే వీర సింహ రెడ్డిగా గర్జిస్తున్న బాలయ్య లుక్ కి మాస్ ఆడియన్స్ బాగా ఇంప్రెస్స్ అయ్యారు. సెకండ్ లుక్ విషయంలో కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే వైట్ అండ్ వైట్ లుక్ లో బాలయ్యని అదివరకే చూసి చూసి ఉండడంతో బోర్ కొట్టేసారు. శృతి హాసన్ లాంటి యంగ్ హీరోయిన్ బాలయ్య పక్కన ఎలా ఉంటుందో అనుకున్నవారికి బాలయ్య షాకిచ్చారు.
యంగ్ లుక్స్ లో సుగుణ సుందరి సాంగ్ లో మెస్మరైజ్ చేసారు. టర్కీ లో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తెరకెక్కించిన సాంగ్ ని రివీల్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో బాలయ్య శృతి హాసన్ తో పోటీగా స్టెప్స్ వేసి ఆకట్టుకోవడమే కాదు, లుక్స్ విషయంలోనూ అదరగొట్టేసారు. బాలకృష్ణ కాస్ట్యూమ్స్, ఆయన స్మైల్, ఆయన లుక్స్ అన్నిటికి ఫాన్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అక్కడక్కడా శృతి హాసన్ ని మించి ఉన్నారు. ఆయన ఫాన్స్ అయితే అబ్బ బాలయ్య యంగ్ లుక్స్ తో పిచ్చెక్కించారు అంటున్నారు.
సుగుణ సుందరి సాంగ్ మేకింగ్ విజువల్స్ బావున్నా, లిరిక్స్ రొటీన్ గా అనిపించినా బాలకృష్ణ -శృతి హాసన్ మాత్రం సాంగ్ ని ఊపేసారు. జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న వీర సింహ రెడ్డి పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. గోపీచంద్ మలినేని ఆ అంచనాలు అందుకుంటామనే ధీమాతో ఉన్నారు.