చాలామంది సౌత్ హీరోయిన్స్ తమకి ఫైనల్ టార్గెట్ బాలీవుడ్ నే అని అక్కడ అవకాశం రాగానే ఎగిరిపోతారు. చాలా కొద్దిమంది మాత్రం అక్కడి ఆఫర్స్ వచ్చినా అలోచించి వెనకడుగు వేస్తారు. అందులో ముఖ్యంగా నయనతార లాంటి వాళ్ళు ఉంటారు. నయనతార క్రేజీగా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ నుండి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఆమె కాదనుకుంది. ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీ తో కలిసి షారుఖ్ హీరోగా జవాన్ లో నటిస్తూ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. కాకపోతే నయనతార టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పాకే అక్కడకి ఎంట్రీ ఇస్తుంది. ఇక సౌత్ నుండి ఇలియానా, కాజల్, తమన్నా లాంటి వాళ్ళు అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ.. ఎవరికి పెద్దగా లక్ కలిసి రాలేదు. రీసెంట్ గా సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో హిట్ కొట్టింది.
అయితే కన్నడ నుండి టాలీవుడ్. అక్కడినుండి బాలీవుడ్ లోకి బాణంలా దూసుకుపోయిన రష్మిక మందన్న హిందీలో హిట్ కొట్టడానికి కిందా మీదా పడుతుంది. ఇప్పటికే రష్మిక నటించిన గుడ్ బై చడీ చప్పుడు లేకుండా థియేటర్స్ నుండి ఓటీటీకి వచ్చేసింది. ఇప్పుడు సిద్దార్థ్ మల్హోత్రాతో చేసిన మిషన్ మజ్ను గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వుద్ది అనుకుంటే.. అది ఓటిటి దారి పట్టింది. హిందీలో నిలదొక్కుకునేందుకు రష్మిక టూ మచ్ గ్లామర్ షో చేస్తూ హైలెట్ అవ్వాలని చూసింది.
కానీ అమ్మడుకి బాలీవుడ్ అదృష్టం అంత కలిసొచ్చినట్టుగా అనిపించడం లేదు. ఇప్పుడు రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ చేస్తుంది. ఒకరెండు ప్రాజెక్ట్స్ ఉన్నా.. ప్రస్తుతం రశ్మికకి హిందీ ఇండస్ట్రీ నిరాశనే మిగిల్చింది. మిషన్ మజ్ను ఓటిటిలో హిట్ కొడితే మళ్ళీ పాప కి లక్కు కలిసొస్తుందేమో చూడాలి.