బిగ్ బాస్ సీజన్ 6 లాస్ట్ వీక్ లోను డేంజర్ జోన్ ఏంట్రా బాబు అనుకుంటున్నారా.. మరి హౌస్ లో ఉన్న ఆరుగురిలో ఎవరో ఒకరు ఈ రోజు ఎలిమినేట్ అయ్యి చివరి కంటెస్టెంట్ గా బయటికి వెళ్లాల్సి ఉంది. అది తెలియక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆరుగురూ గ్రాండ్ ఫినాలేలో లో ఉంటామని కలలు కంటున్నారు. రేవంత్ అయితే విన్నర్ గా ఫిక్స్ అయ్యిపోయాడు. శ్రీహన్ కూడా అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ఇక మొదటి వారం నుండి నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఓటింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటున్న రేవంత్ కి చివరి వారంలో ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. అయినా కొద్ది ఓట్ల తేడాతో మొదటి స్థానంలో ఉన్న రేవంత్ కి శ్రీహన్ గట్టి పోటీ ఇస్తున్నాడు.
తర్వాత రోహిత్ మూడో స్థానంలో ఉండగా.. నాలుగో స్తానంలో కీర్తి, ఐదో స్థానంలో ఆది రెడ్డి, చివరి స్థానంలో శ్రీ సత్య ఉన్నారు. ఈ రోజు బుధవారం రాత్రి కీర్తి-ఆది రెడ్డి-శ్రీ సత్య లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఈ ముగ్గురిలో ఒకరైతే ఈరోజు హౌస్ ని వీడాల్సిందే. ఓటింగ్ లో స్వల్ప తేడాతో ఆది రెడ్డి, శ్రీసత్య, కీర్తి ఉండడంతో వీరి ఎలిమినేషన్ పై రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఇక ఈ ఆది వారం గ్రాండ్ ఫినాలేకి బిగ్ బాస్ యాజమాన్యం గట్టి ఏర్పాట్లే చేస్తుంది. కొన్ని సీజన్స్ కి మెగాస్టార్ ని గెస్ట్ గా తీసుకు వచ్చిన బిగ్ బాస్ యాజమాన్యం గత సీజన్ ని గెస్ట్ లేకుండానే లాగించేసింది. ఇక ఈ సీజన్ కి ఏ హీరో గెస్ట్ గా వస్తాడో అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. బాలకృష్ణ వచ్చే ఛాన్స్ వుంది అన్నప్పటికీ.. అది జరిగే పని కాదు అంటున్నారు నెటిజెన్స్.