Advertisement
Google Ads BL

ఇక్కడ రొమాంటిక్ శృతి.. మరి అక్కడ..


రాబోయే సంక్రాంతికి ఒక్క హీరోయిన్ హవానే కనిపిస్తుంది. బాలకృష్ణ వీర సింహ రెడ్డిలోను, చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాలోనూ హీరోయిన్ గా కనిపించబోయేది శృతి హాసన్. ప్రస్తుతం బాలయ్య, చిరు లతో శృతి హాసన్ రొమాంటిక్ గా డ్యూయెట్స్ లో డాన్స్ స్టెప్స్ వేస్తుంది. చిరంజీవి తో రెండు సాంగ్స్ కోసం ప్రస్తుతం ఆమె యూరప్ వెళ్ళింది. ఇప్పటికే బాలయ్య తో వేసిన చిందులు పూర్తయ్యాయి. ఇక వీర సింహ రెడ్డి నుండి సెకండ్ సింగిల్ గా శృతి హాసన్ తో బాలకృష్ణ రొమాంటిక్ సాంగ్ రాబోతుంది. అది రేపు డిసెంబర్ 15 న విడుదల చేస్తున్నారు.

Advertisement
CJ Advs

వీరసింహ రెడ్డి నుండి విడుదలవుతున్న సెకండ్ సింగిల్ పోస్టర్స్ లో శృతి హాసన్ బాలయ్య తో చాలా రొమాంటిక్ గా గ్లామర్ గా కనిపిస్తుంది. ఈ సాంగ్ టర్కీలో తెరకెక్కింది. ఇందులో ఇంత అందంగా ఉన్న శృతి హాసన్ వీరయ్య పక్కన ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది. చిరు పక్కన రొమాంటిక్ గా ఉంటుందా.. అంతకు మించి అనేలా శృతి హాసన్ కనిపిస్తుందా.. అని మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాల్తేర్ వీరయ్య నుండి ఇంకా శృతి హాసన్ పిక్ రిలీజ్ అవ్వలేదు.

మాస్ కేరెక్టర్ వీరయ్య సరసన శృతి హాసన్ ఎలా కనబడుతుందో.. సారీస్ లోనా లేదంటే మరింత గ్లామర్ షో చేస్తుందో అనే క్యూరియాసిటీ ఫాన్స్ లో పెరిగిపోతుంది. వీర సింహ రెడ్డి సాంగ్ తర్వాత వీరయ్య సాంగ్ కూడా క్యూ లోనే ఉంటుంది.

Balakrishna and Shruti Haasan romantic pics in Veera Simha Reddy:

Balakrishna, Shruti Haasan Turkey Romance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs