ఢీ డాన్స్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుని తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తూ ఫెమస్ అయ్యాడు శేఖర్ మాస్టర్. చిరంజీవి దగ్గర నుండి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయ్యాడు. అయినప్పటికీ ఈటీవీలో మల్లెమాల లో జరిగే ఢీ డాన్స్ రియాలిటీ షో అలాగే జబర్దస్త్ కి అప్పుడప్పుడు జెడ్జ్ గా వస్తున్నాడు. ఢీ డాన్స్ లో కొన్ని సీజన్స్ కి రెగ్యులర్ గా జెడ్జ్ గా వచ్చే శేఖర్ మాస్టర్ జబర్దస్త్ జెడ్జ్ గా రోజా పక్కన కామెడీ కూడా చేసేవాడు.
కానీ ఉన్నట్టుండి శేఖర్ మాస్టర్ ఢీ డాన్స్ షో కి, జబర్దస్త్ షో కి, టోటల్ ఈటీవీకే బై బై చెప్పేసి స్టార్ మా లో తేలాడు. అక్కడ జరిగే కామెడీ స్టార్స్ కి, స్పెషల్ ప్రోగ్రామ్స్ కి జెడ్జ్ గా రావడం మొదలు పెట్టాడు. అయితే ఢీ డాన్స్ షో నుండి శేఖర్ తప్పుకోవడం పట్ల చాలారకాల అనుమానాలు, ఊహాగానాలు నడిచాయి. పారితోషకం విషయంలో యాజమాన్యంతో వచ్చిన విభేదాల కారణంగానే శేఖర్ తప్పుకున్నాడని అన్నప్పటికీ.. ఢీ డాన్స్ షోకి రెగ్యులర్ గా డేట్స్ కేటాయించలేక మానేసానని శేఖర్ మాస్టర్ అన్నాడు. అంతేకాకుండా ఢీ డాన్స్ షో నాకు లైఫ్ ఇచ్చింది దాని నుండి దూరం కాను అన్నాడు.
అన్నట్టుగానే శేఖర్ మాస్టర్ మళ్ళీ ఢీ డాన్స్ షోకి రీ ఎంట్రీ ఇచ్చేసాడు. ఢీ 15 వ సీజన్ కి శ్రద్ద దాస్ తో కలిసి జెడ్జ్ గా అదిరిపోయే పెరఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చేసాడు. స్టేజ్ పై హైపర్ ఆది కామెడీకి పంచ్ లు వేస్తూ శేఖర్ సందడి చేసాడు. ఇక ఈ సీజన్ లో ఆది మెంటర్ గా ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా కంటిన్యూ అవుతున్నారు. కొత్తగా బిగ్ బాస్ జెస్సి ఢీ డాన్స్ స్టేజ్ పై కనిపిస్తున్నాడు. ఈ సీజన్ ని కొత్తాగా సరికొత్తగా ప్లాన్ చేసారు. ఈ రోజు బుధవారం జరగబోయే సీజన్ 15 ఎంట్రీ ఎపిసోడ్ లో ప్రభుదేవా మాస్టర్ రాబోతున్నారు.