Advertisement
Google Ads BL

ప్రభాస్ లోని మరో కోణం చూస్తారా?


ప్రభాస్ త్వరగా నలుగురిలో కలవలేడు, ఆయనకి సిగ్గు, బిడియం, బాగా మొహమాటస్తుడు. అంత సిగ్గు, మొహమాటం ఉన్న ప్రభాస్ ఓ టాక్ షో లో పాల్గొంటే ఆ షో పై క్రేజ్ ఉండక ఏముంటుంది. ప్రభాస్ బాలీవుడ్ టాక్ షోస్ లో పాల్గొన్నా అది తెలుగు ప్రేక్షకులకి సరిగా అర్ధమవదు. కానీ ప్రభాస్ తెలుగు వాడు. అలాంటి తెలుగు స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ తెలుగు టాప్ 1 టాక్ షో లో సందడి చేస్తే ఫాన్స్ కి మాత్రమే కాదు ఆడియన్స్ అందరికి కిక్కే. ప్రభాస్ తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి గెస్ట్ గా హాజరయ్యాడు. అది కూడా తన ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి. మరా ఆహా ఎపిసోడ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో బయట ఆయన ఫాన్స్ చేస్తున్న  హంగామా చూస్తే తెలుస్తుంది.

Advertisement
CJ Advs

బాలయ్య-ప్రభాస్-గోపీచంద్ ల ఆహా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ గ్లిమ్ప్స్ ని వదిలారు. అందులో ప్రభాస్ గ్రాండ్ గా స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది మొదలు బాలయ్య తో అల్లరి చెయ్యడం, గోపీచంద్ తో ప్రభాస్ చేసిన సందడి నమస్కారం అన్ని హైలెట్ గా నిలబోవడం కాదు, ఎపిసోడ్ పై ఉన్న అంచనాలు మరింతగా పెరిగేలా చేసాయి. ఏయ్ ఏం చేస్తున్నావ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ చేసిన హంగామాకి అక్కడే ఉన్న ఆడియన్స్ కేకలు, విజిల్స్ అబ్బో మాములుగా లేదు. బాలయ్యని ఆగమనంటూ ప్రభాస్ చేసిన విన్యాసాలు అన్ని అద్భుతః అన్న రేంజ్ లో ఉన్నాయి.

గోపీచంద్ తో ఫ్రెండ్ షిప్ ఏ రేంజ్ లో ఉందో ప్రభాస్ చూపించిన ప్రేమ కనిపిస్తుంది. సిగ్గు, బిడియం చూపించే ప్రభాస్ లోని మరోకోణం అన్ స్టాపబుల్ ఆవిష్కరించబోతుంది. ఇక ప్రభాస్ బాలయ్య కోసం ప్రత్యేకమైన వంటలు చేయించి అన్ స్టాపబుల్ షో దగ్గరకి కెరీర్ తెచ్చాడనే ప్రచారమూ జరుగుతుంది. హీరోయిన్స్ మాత్రమే కాదు బాలయ్య కూడా ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయ్యారట. 

Unstoppable glimpse: Prabhas-Balakrishna casts a magic spell:

Unstoppable Baahubali glimpse out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs