Advertisement
Google Ads BL

బాలీవుడ్ లో హీరోయిన్స్ గుద్దులాట


బాలీవుడ్ లో సినిమాల పరంగా హీరోయిన్స్ మధ్యన పోటీ నడవడం వేరు, ఇక్కడ తప్పు చేసి ఒకరి నొకరు బ్లేమ్ చేసుకోవడం కాదు, ఒకరి మీద ఒకరు పరువు నష్టం దావా వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం సుకేష్ చంద్రశేఖర్ తో ఫ్రెండ్ షిప్ చేసి నానాతంటాలు పడుతుంది. సుకేష్ చంద్రశేఖర్ నుండి బహుమతులు తీసుకుని, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అవ్వాల్సిన జాక్వలిన్ తృటిలో తప్పించుకుంది. ఈ కేసులో తప్పు ఒప్పుకున్న జాక్వలిన్ మరో హీరోయిన్ నోరా ఫతేహి కూడా ఇరికించింది.

Advertisement
CJ Advs

జాక్వలిన్ ఈడీ విచారణలో భాగంగా సుకేష్ చంద్రశేఖర్ నుండి నోరా ఫతేహి బహుమతులు తీసుకున్న వారిలో ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దాంతో ఈడీ అధికారులు నోరా ఫతేహిని కూడా విచారించారు. ఈడీ విచారణతో ఇబ్బంది పడిననోరా ఫతేహి జాక్వలిన్ పై పరువు ష్టం దావా వేసింది. తనని ఈకేసులో జాక్వలిన్ కావాలనే ఇరికించింది. తాను ఎవరి దగ్గర బహుమతులు తీసుకోలేదు, సుఖేష్ నుండి కూడా తాను ఎలాంటి లాభం పొందలేదు, జాక్వలిన్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా తన పరువు పోవడం కాదు, తనకి రావాల్సిన సినిమా అవకాశాలు, యాడ్స్, అలాగే షోస్ చేసే అవకాశం చేజారిపోయింది.

ఇదంతా కేవలం జాక్వలిన్ చెప్పడం వలనే జరిగింది అంటూ నోరా జాక్వలిన్ పై ఢిల్లీ కోర్టులో 200 కోట్లకి పరువు నష్టం దాఖలు చేసింది. అలాగే తనపై తప్పుడు ప్రచారం అంటే.. జాక్వెలిన్ చెప్పినట్లు మనీ లాండరింగ్‌లో తన పేరుని రాసిన కొన్ని మీడియా సంస్థల పేర్లని కూడా తానిచ్చిన స్టేట్‌మెంట్‌లో పొందుపరిచింది.

ప్రస్తుతం ఈ హాట్ హీరోయిన్స్ నోరా ఫతేహి - జాక్వలిన్ మధ్య గుద్దులాట అక్కడ మీడియాలో హైలెట్ గా వినిపిస్తుంది.

Nora Fatehi takes on Jacqueline Fernandez:

Nora Fatehi files defamation complaint against Jacqueline Fernandez before Delhi court
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs