Advertisement
Google Ads BL

పెళ్లైపోయింది అన్న వార్తలపై అంజలికి క్లారిటీ


హీరోయిన్ గా తెలుగు, తమిళంలో సినిమాలు చేసుకుంటూపోతున్న అంజలి ప్రస్తుతం తెలుగులో, తమిళం, హిందీలో క్రేజీ మూవీగా తెరకెక్కుతున్న RC15 లో రామ్ చరణ్ వైఫ్ గా నటిస్తుంది. అంతేకాకుండా తమిళ సినిమాలతో బిజీగా ఉంటున్న అంజలి గతంలో హీరో జై ప్రేమలో మునిగి తేలింది. ఆల్మోస్ట్ అంజలి-జై వివాహమాడబోతున్నారన్న సమయంలో వారికి బ్రేకప్ అయ్యింది. తర్వాత జై, అంజలి ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.

Advertisement
CJ Advs

మళ్ళీ ఇన్నాళ్ళకి అంజలి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అంజలికి రీసెంట్ గా ఓ బిజినెస్ మ్యాన్ తో పెళ్లైపోయింది అంటూ కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రచారం షురూ అయ్యింది. అయితే అంజలి తమిళ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తన స్టయిల్లో క్లారిటీ ఇచ్చింది. తనకి పెళ్ళైపోవడమే కాదు, తాను అమెరికాలో కాపురం పెట్టానంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.

తనకి పెళ్లయింది, అది కూడా బిజినెస్ మ్యాన్ తో, అతనితో కలిసి నేను అమెరికా లో ఉంటున్నా అంటూ వస్తున్న వార్తల్లో ఏది నిజం కాదు, ఇదంతా కల్పితం మాత్రమే. నాకసలు అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. కానీ తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని.. అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం జరుగుతుందని చెప్పుకొచ్చింది అంజలి.

Anjali gives clarity on her wedding rumours:

Actress Anjali gives clarity on her wedding rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs