పవన్ కళ్యాణ్ ఫాన్స్ ప్రస్తుతం కొత్త టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్ పై గుర్రుగా ఉన్నారు. భవదీయుడు భగత్ సింగ్ అంటే చాలా డీసెంట్ గా కూల్ గా ఉంది, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఏమిట్రా బాబు అంటూ వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఉస్తాద్ అనే టాగ్ రామ్ పోతినేనికి ఉంది. అదే టాగ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ సినిమాకి పెట్టడం ఏమిటి. కొత్తగా ఆలోచించలేవా హరీష్ అంటూ హారిష్ శంకర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే హరీష్ తన కథతో తమిళ తేరి మూవీ కథని మిక్స్ చేసి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కించబోతున్నాడనే న్యూస్ చూసాక పవన్ ఫాన్స్ మరింతగా రగిలిపోతున్నారు.
గబ్బర్ సింగ్ రీమేక్ ఎక్కడా.. తేరి రీమేక్ ఎక్కడ హరీష్ అంటూ వారు సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్నారు. తేరి విజయ్ కి హిట్ ఇవ్వొచ్చు కానీ, పవన్ కళ్యాణ్ కి ఆ రీమేక్ పనికిరాదు అంటూనే ఆ ఉస్తాద్ టైటిల్ విషయంలోనూ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు రామ్ ఫాన్స్ గట్టిగా మాట్లాడలేక మా రామ్ స్పెషల్ నేమ్ ని మీరు వాడేస్తారా అంటూ వాళ్ళు కోపంగానే ఉన్నారు. మరి భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ మార్చేసినట్లుగా ఉస్తాద్ కూడా చివరికి మారొచ్చనే ఊహాగానాలు నడుస్తున్నాయి.
రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యుల్ర్ షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. ఈ సినిమా విషయంలో ఏ తేడా జరిగినా పవన్ ఫాన్స్ చేతిలో హరీష్ శంకర్ కి మూడిందే.