పవన్ కళ్యాణ్ ఎలెక్షన్స్ ప్రచారానికి ఓ వాహనాన్ని తయారు చేయించారు. 2024 ఏపీ ఎన్నికల కోసం ప్రస్తుతం ఆయన ఏపీలో ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. దాని కోసం అన్ని హంగులతో మిలటరీ వాహనాన్ని, దాని రంగుని పోలిన వారాహిని తయారు చేయించారు. వారాహి వాహనం స్పెషల్ రైడ్ చేసిన పవన్ కళ్యాణ్ ని చూసిన వైసిపి నేతలు కుళ్ళుకోవడం మొదలు పెట్టారు. ఏపీ సీఎం జగన్ గారైతే మాకు ఆ వారాహిని పంపించండి, ప్రచారానికి వాడుకుంటామంటూ కామెంట్ చేసారు. అంతేకాకుండా వైసిపి మంత్రులు ఆర్మీ వాహనాల రంగుతో వారాహితో ఎవరి మీద యుద్దానికి వెళ్తావ్ అంటూ కామెంట్స్ చేసారు.
దానికి పవన్ కళ్యాణ్ YCP టిక్కట్ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి AP అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే AP లో వీరి లంచాలు, వాటాలు వేధింపులవలన కారు నుంచి కట్‌డ్రాయర్ కంపెనీల దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్.. అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈమధ్యన వారాహి రంగు ని ఆర్టీవో అధికారులు ఒప్పుకోరు, రంగు మార్చాకే ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ అన్నారు.
కానీ తాజాగా పవన్ కళ్యాణ్ వారాహీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ కూడా ఇచ్చేసారు. నిబంధనలకు అనుగుణంగానే వారాహి వాహనం రంగు ఉందని, వారాహికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వాడారని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ తెలియజేసారు. వారాహి వాహనం తమ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని నిబంధనలు ఉన్నాయని, తర్వాత ఏమైనా మార్పులు జరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. వారం రోజుల క్రితమే వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు.
వారాహి వాహనానికి TS 13 EX 8384 పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందని ఆయన అన్నారు. దానితో జనసైనికులు పండగ చేసుకుంటున్నారు. అన్ని అడ్డంకులు తొలిగిపోయి వారాహి రోడ్డెక్కనుంది అంటూ వారు ఉత్సాహంతో వారాహి కోసం ఎదురు చూస్తున్నారు.