టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా పేరు పొంది.. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీస్ మేకర్స్ ఆఫీస్ లు, ఇళ్లపై హైదరాబాద్ లోని 15 ప్రాంతాల్లో ఈ రోజు సోమవారం జీఎస్టీ దాడులు జరగడం ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. పుష్ప పాన్ ఇండియా మూవీ, సర్కారు వారి పాట చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీస్ వారు తప్పుడు లెక్కలతో పంబు ఎగవేత, జీఎస్టీ కట్టకుండా మభ్యపెడుతున్నారని జీఎస్టీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల ఈ రోజు సోమవారం ఉదయం నుండి దాడులు నిర్వహిస్తున్నారు.
మైత్రి మూవీస్ మేకర్స్ లో ముఖ్యమైన నవీన్ యెర్నేని, యలంనుంచిలి రవిశంకర్ ఇళ్లలోనూ జీఎస్టీ దాడులు జరిగినట్లుగా తెలుస్తుంది. రెండు నెలల క్రితం కూడా మాదాపూర్ లోని మైత్రి ఆఫీస్ లో ఈ జీఎస్టీ దాడులు జరగగా.. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా మరోమారు ఐటి అధికారులు మైత్రి మూవీ మేకర్స్ పై పడినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మైత్రి మూవీ వారి నిర్మించిన చిరు వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా.. వాటి బిజినెస్ లు జోరుగా సాగుతున్న టైమ్ లో ఈ దాడులు కలకలం సృష్టిస్తున్నారు.
ఇవే కాకుండా మైత్రి వారు పుష్ప ద రూల్, పవన్ కళ్యాణ్ తో నిన్న ఆదివారం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఇవన్నీ దాదాపుగా 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీస్ కావడంతో ఈ నిర్మాణసంస్థపై ఐటి అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని సినిమాలు మైత్రి వారు నిర్మాణంలో పట్టాలెక్కడానికి రెడీగా ఉన్నాయి.
ఈ జీఎస్టీ దాడులు కేవలం మైత్రి మూవీస్ మీద మాత్రమే కాకుండా, టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలపై కూడా అతిత్వరలోనే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జీఎస్టీ అధికారులు టాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది.