Advertisement
Google Ads BL

‘ఉస్తాద్ BS’పై బండ్లన్న రియాక్షన్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘గబ్బర్‌సింగ్’ తర్వాత రెండో సారి తెరకెక్కబోతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. వాస్తవానికి ఈ చిత్రానికి ముందు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అని నామకరణం చేసి పోస్టర్స్ కూడా విడుదల చేశారు. మరి టైటిల్‌లో పవర్ తగ్గిందో.. లేదంటే స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత కథలో పవర్ పెరిగిందో తెలియదు కానీ.. సడెన్‌గా టైటిల్ మార్చి.. ఆ వెంటనే పూజా కార్యక్రమాలు కూడా ముగించేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతామని మేకర్స్ కూడా తెలియజేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బండ్ల గణేష్ కూడా ఒకరు. బండ్ల గణేష్ ఏది చేసినా తనకో స్పెషల్ ఉంటుంది. ఈ సినిమాపై ఆయన రియాక్ట్ అయిన తీరు కూడా ఇప్పుడు అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటోంది. 

Advertisement
CJ Advs

 

ఈ సందర్భంగా బండ్ల గణేష్.. ‘‘భారతదేశ చలనచిత్ర పరిశ్రమ రికార్డులన్నీ బద్దలు అయ్యే విధంగా ఈ సినిమా ఉండాలని.. ఆ విధంగా నిర్మించే సత్తా ఆ నిర్మాతలకు ఉందని.. అలాగే దర్శకత్వం వహించే మీకు ఆ సామర్థ్యం ఉందని నాకు తెలుసు. కచ్చితంగా భారతదేశపు నెంబర్ 1 చిత్రంగా నిలవబోతోంది’’ అంటూ హరీష్ శంకర్ చేసిన ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చాడు. అయితే అంతకు ముందు ఇదే సినిమాపై సోషల్ మీడియాలో జరిగిన రచ్చపై కూడా బండ్ల కలగజేసుకుని.. బాస్‌తో బ్లాక్‌బస్టర్ నేను కొట్టి చూపిస్తా.. ప్రామిస్ అంటూ అభిమానులను సముదాయించే ప్రయత్నం చేశాడు బండ్ల. ఇక సినిమా ఓపెనింగ్ జరిగిన తర్వాత చాలా సేపటి వరకు బండ్లన్న రియాక్ట్ అవకపోవడంతో.. ఏదో ఒకటి చెప్పన్న అంటూ ఫ్యాన్స్ ఆయన పేరుని ట్రెండ్ చేశారు. ఆ ట్రెండ్ చూసి.. హరీష్ ట్వీట్‌కి రిప్లయ్ ఇస్తూ.. సినిమాపై పై విధంగా చెప్పుకొచ్చాడీ బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్.

Bandla Ganesh Reaction on Ustaad Bhagat Singh:

Bandla Ganesh Happy with Ustaad Bhagat Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs