Advertisement
Google Ads BL

ప్రభాస్ కాదు.. భర్తగా అలాంటోడు కావాలి


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి.. ఎప్పుడూ హాట్ టాపిక్కే. స్టార్ హీరోయిన్ అనుష్కతో ఇప్పటికే ఆయనకు కొందరు పెళ్లి చేసేశారు. ఈ మధ్య బాలీవుడ్ భామ కృతిసనన్‌తో ఇక పెళ్లే అన్నట్లుగా పుట్టించేశారు. కానీ ప్రభాస్ సైడ్ నుంచి ఎటువంటి పెళ్లి వార్తా రాలేదు. కానీ.. ప్రభాస్ పెళ్లిని.. సినిమా ప్రమోషన్‌కి వాడుకుంది హీరోయిన్ కృతిసనన్. వరుణ్ ధావన్‌తో కృతిసనన్ చేసిన ‘భేదియా’ చిత్రానికి ప్రభాస్‌ని ఎలా వాడారో తెలియంది కాదు. తీరా ఆ సినిమా విడుదలైన తర్వాత.. అలాంటిదేమీ లేదు అంటూ కృతి కటింగ్ ఇచ్చింది. ఆ మాటతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ఎందుకంటే.. డేట్ ఒకడితో, కిస్సు మరొకడితో.. పెళ్లి ఇంకొకడితో అని చెప్పే హీరోయిన్‌ని ప్రభాస్ ఎక్కడ పెళ్లి చేసుకుంటాడో అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. ఆమె అలా చెప్పిన తర్వాత కాస్త కూల్ అయ్యారు. తాజాగా కృతిసనన్ మరోసారి పెళ్లి టాపిక్‌ని లేవనెత్తింది.

Advertisement
CJ Advs

 

‘‘ప్రభాస్‌కు, నాకు మధ్య ఏదో ఉందని బాలీవుడ్‌ అంతా మాట్లాడుకుంటోంది. నిజానికి ప్రభాస్‌ మంచి కో-స్టార్‌ అంతే. సెట్లో అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఆ మాత్రం దానికే ప్రేమ- పెళ్లి అంటూ రాయడం సరికాదు. ఇప్పట్లో పెళ్లి ఆలోచనలు లేవు కానీ.. నాకు ఎలాంటి వాడు కావాలంటే.. మంచి అందగాడు కావాలి. చిన్నప్పుడు, ప్రేమంటే తెలియని వయసులో క్రష్‌లు ఉండటం మాములే. నేను కూడా రెండు మూడుసార్లు ఆ అనుభూతిని పొందాను. కానీ అప్పట్లో నేను భయస్తురాలిని. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదానిని కాదు. నేను ఇష్టపడిన అబ్బాయిల దగ్గర కూడా నోరు మెదపలేకపోయాను. కాకపోతే ఆ మూమెంట్స్‌ అన్నీ నాకు గుర్తే. నాకు కాబోయే వాడు ఎలా ఉండాలనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నాకు కాబోయే భర్త నాకంటే పొడవు ఉండాలి. అందగాడు కావాలి. మంచి మాటకారై ఉండాలి. తనతో ఎప్పటికీ నాకు బోర్‌ కొట్టకూడదు. ఈ క్వాలిటీస్ ఉన్న వాడిని చూసి పెళ్లి చేసుకుంటాను’’.. అని కృతిసనన్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Kriti Sanon Talking about her Prospective Groom:

Kriti Sanon Talks About Relation with Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs