బిగ్ బాస్ సీజన్ 6 లో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ చాలా వారాలుగా చాలామంది కామెంట్స్ చేసినా ఈ వారం ఇనాయ ఎలిమినేషన్ విషయాన్ని ఆమె ఫాన్స్ మాత్రమే కాదు నెటిజెన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి సూర్య, గీతూ, బాలాదిత్య వెళ్ళినప్పుడు అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అనే అన్నారు. ఇప్పుడు ఈ చివరి వారంలో కీర్తి కానీ-శ్రీ సత్య కానీ ఎలిమినేట్ అవుతారని ఓటింగ్ బట్టి గెస్ చేసిన ఆడియన్స్ కి, నెటిజెన్స్, అభిమానులకి తట్టుకోలేని షాకిచ్చారు. ఇనాయని ఎలిమినేట్ చేసి ఆమె అభిమానుల గుండెల్లో చిచ్చు పెట్టారు.
ఇనాయ మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేషన్ లో దొరికిపోతుంది అనుకుంటే తర్వాత ఆమె బాగా ఇంప్రూవ్ అయ్యి గొడవలతో, టాస్క్ లతో హైలెట్ అయ్యి గ్రాఫ్ పెంచుకుంది. మధ్యలో సూర్య ప్రభావంతో ఇనాయ కాస్త తగ్గినా అతను ఎలిమినేట్ అవ్వగానే మరోసారి రేజ్ అయ్యింది. కెప్టెన్సీ కోసం చివరి వారం వరకు పోరాడి చివరి వారంలో బిగ్ బాస్ సీజన్ 6 చివరి కెప్టెన్ గా గెలిచి చూపించింది. లేడీ సింహంగా నోరేసుకుని పడిపోయిన ఇనాయ సుల్తానా ఈ సీజన్ లో చివరి కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అవడం ఎవ్వరికీ నచ్చడం లేదు.
ఇది తుప్పాసి ఎలిమినేషన్, అన్ ఫెయిర్ ఎలిమినేషన్, ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న శ్రీసత్య, కీర్తిని వదిలేసి ఇనాయని ఎలిమినేట్ చేయడంపై బిగ్ బాస్ పై నెటిజెన్స్, ఇనాయ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎంటర్టైన్మెంట్ లేకుండా తుప్పాసి సీజన్ లా ఉన్న బిగ్ బాస్.. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ లో కూడా అన్ ఫెయిర్ చేసారు. ఓటింగ్ చూసి ఎలిమినేట్ చెయ్యకపోతే మా ఓటింగ్ ఎందుకు అడిగారు, మేమంటే లెక్కలేదా మీకు అంటూ బిగ్ బాస్ నుండి ఇనాయని ఎలిమినేట్ చేసినందుకు బిగ్ బాస్ ని తిడుతూ #BiggBoss6Telugu, INAYA UNFAIR ELIMINATION హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.