హోటల్ బిజినెస్ లోకి జబర్దస్త్ కమెడియన్


జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫెమస్ అయ్యి నాగబాబు గారు జబర్దస్త్ వదిలేశారని, అతను కూడా జబర్దస్త్ ని వదిలి.. అదిరింది ప్రోగ్రాం లో చేసి.. తర్వాత స్టార్ మాలో తేలాక.. జబర్దస్త్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఇకపై జబర్దస్త్ గుమ్మం తొక్కను అంటూ.. గ్రాండ్ గా సినిమాని మొదలు పెట్టి తర్వాత ఆ సినిమా అనివార్య కారణాల వలన ఆగిపోవడంతో కాస్త ప్రస్టేట్ అయ్యి మల్లెమాల యాజమాన్యం తనని ఎదగనివ్వదు అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు సినిమా వదిలేసి కొత్తగా హోటల్ బిజినెస్ లోకి వెళ్ళాడు. మేము కష్టపడ్డాం, గనకే మాకు పేరొచ్చింది.. అంతేకాని మాకు జబర్దస్త్ లైఫ్ ఇవ్వలేదు అంటూ సంచలనంగా మాట్లాడిన ఆర్పీ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ పెట్టాడు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌస్‌బోర్డ్‌ 3వ ఫేజ్‌లోని మంజీరా వాటర్‌ ట్యాంక్‌ ఎదురుగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో టెక్ ఏవే  ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌ను ఎందరో స్టార్‌ హీరోలకు నటనలో మెళకువలు నేర్పిన వైజాగ్‌ సత్యానంద్‌ మాస్టార్‌ ప్రారంభింశారు. మాది నెల్లూరు జిల్లా. నాకు చేపల పులుసు అంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. నాలాగే చాలా మందికి నెల్లూరు చేపల పులుసు అంటే ఇష్టం. ఇప్పటికి ఎవరైనా నెల్లూరు నుంచి వస్తుంటే చేపల పులుసు తీసుకురమ్మని చెపుతుంటారు. ఇంతకుముంది నేను కూడా చాలా మంది సెలబ్రిటీలకు, వీఐపీలకు కుండల్లో తీసుకువచ్చి ఇచ్చాను. 

ఇంతటి రుచికరమైన చేపల పులుసును హైదరాబాద్‌లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నేను 10 ఏళ్ళల క్రితమే అనుకున్నాను. అది ఇప్పటికి సాధ్యమైంది. ఈ రెస్టారెంట్ లో పూర్తిగా సంప్రదాయ పద్దతిలో కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే వండటం జరుగుతుంది. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలతో కూడా టై అప్‌ అయ్యాం. నాతో పాటు సత్తెన్న అనే నా మిత్రుడు ఇందులో పార్టనర్‌గా ఉన్నారు.. అంటూ ఆర్పీ తన హోటల్ విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

Nellore Pedda Reddy Chepala Pulusu Hotel opening:

Kiraak RP Nellore Pedda Reddy Chepala Pulusu Hotel 
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES