ఈరోజు సోషల్ మీడియాని ఓ ముగ్గురు స్టార్ హీరోలు ఆక్యుపై చేసారు. ఆ హీరోల ఫాన్స్ వారిని, వారి కొత్త పిక్స్ ని సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. అందులో ముందుగా మహేష్ బాబు జిమ్ పిక్ బయటికి వచ్చింది. దానితో మహేష్ ఫాన్స్ ఆయన కొత్త లుక్ ని, జిమ్ లుక్ ని వైరల్ చేస్తున్నారు. SSMB28 షూటింగ్ సెకండ్ షెడ్యూల్ డిసెంబర్ 15 నుండి హైదరాబాద్ లో మొదలుకాబోతుంది. ఇక మహేష్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చమటలు చిందిస్తున్న పిక్ తో ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు.
అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సెట్స్ లోని పిక్స్ బయటికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో డిస్కస్ చేస్తున్న పిక్ తో పాటుగా, దర్శకుడు క్రిష్ పిక్స్ రివీల్ చేసారు మేకర్స్, పవన్ కళ్యాణ్ వీరమల్లు గా అదిరిపోయే కాస్ట్యూమ్స్ లో కనిపిస్తున్నారు. దానితో పవన్ ఫాన్స్ రెచ్చిపోయి ట్రెండ్ చేస్తుంటే.. సాయంత్రానికి పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ అంటూ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇంక చెప్పేదేముంది పవన్ ఫాన్స్ పూనకాలతో ఊగిపోయారు.
అంతలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K సెట్స్ నుండి పిక్ బయటికి వచ్చింది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ తో ప్రభాస్ కూర్చున్న పిక్ అది. ఇక చెప్పేదేముంది.. ప్రభాస్ కనిపిస్తే ప్రభాస్ ఫాన్స్ ఊరుకుంటారా.. అదేపనిగా లైక్స్, షేర్స్ తో హోరెత్తించారు. ప్రాజెక్ట్ K కి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న సింగీతంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటూ ఆ పిక్ ని వైరల్ చెయ్యడంతో.. ప్రాజెక్ట్ K, ప్రభాస్ హాష్ టాగ్స్ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసాయి.
ఈ రోజు మహేష్-పవన్-ప్రభాస్ కొత్త పిక్స్, కొత్త లుక్స్ = తో ఫాన్స్ పండగ చేసుకోవడం కాదు, సోషల్ మీడియాని ముగ్గురూ ఫాన్స్ ఆక్యుపై చేసి ఊపేస్తున్నారు.