Advertisement
Google Ads BL

20 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాక్టీస్


పవర్ స్టార్ పవన్ కళ్యణ్ హీరో అవ్వకముందే ఆయన మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం పొందారు. పవన్ కళ్యాణ్ వెండితెర అరంగేట్రం మూవీ అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ సాహసాలు చూసాం, తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ చూసాం. అయితే అప్పటినుండి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ లో లేరట. ఆ విషయాన్ని తాజాగా ఓ పిక్ తో రెండు దశాబ్దాల తర్వాత నేను నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లోకి వచ్చాను అంటూ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కారణంగా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్, కత్తి సాము, గుర్రపు స్వారీ చెయ్యాల్సి ఉంది. అందుకే ఆయన మళ్ళీ యుద్ధ విద్యలలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ కత్తి స్వాము, గుర్రపు స్వారీ పిక్స్ వైరల్ అవ్వగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ షేర్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ పిక్ విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ డ్రెస్ లో ప్రాక్టీస్ చేస్తున్న పిక్ చూసిన పవన్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి.

ఈరోజు రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ లో వీరమల్లు గెటప్ లో ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసిన పవన్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ పిక్ తో మరింత ఫైర్ పుట్టించారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ పిక్ ని సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Pawan Martial Arts Practice:

Pawan Kalyan Martial Arts Practice, After 2 Decades
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs