Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ అంటే అంత ఈజీ అనుకున్నారా?


సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రస్తుతం సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అటు సినిమాలు ఇటు యాడ్స్ తో అభిమానుల మనసులని దోచేస్తున్న సూపర్ స్టార్ రీసెంట్ గా తన భార్య నమ్రత పేరు మీద ఏసియన్ వారితో కలిసి ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. గతంలో మహేష్ పేరు మీద ఏసియన్ వారితో AMB తో మల్టిప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ ఇప్పుడు భార్య పేరు మీద AN రెస్టారెంట్ ఓపెన్ చేసారు. మహేష్ కి ఉన్న బ్రాండ్ వాల్యూ ఆయన ఏం చేసినా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు రెస్టారెంట్ కి ఎంతో క్రేజీగా వచ్చే కస్టమర్స్ మాత్రం ఘొల్లుమంటున్నారు. బంజారాహిల్స్ లో అన్ని వసతులతో కూడిన AN రెస్టారెంట్ లో ఉదయం కాఫీ, టిఫిన్స్ దగ్గర నుండి లంచ్, ఈవెనింగ్ స్నాక్స్, డిన్నర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే మహేష్ రెస్టారెంట్ లో ఫుడ్ మెనూ రేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పది నుండి ఇరవై రూపాయలకు దొరికే ప్లేట్ పునుగులు ధర మహేష్ బాబు AN రెస్టారెంట్ లో 125 రూపాయలు వేస్తున్నారట. ఇడ్లి 100, దోస మినిమమ్ 200 నుంచి మొదలు అంటూ మెనులో రేట్లు దర్శనమిస్తున్నాయట.

మరి సెలెబ్రిటీ రెస్టారెంట్ కి కేవలం సెలెబ్రిటీస్ మాత్రమే వెళ్లేలా ఈ రేట్స్ ఉన్నాయంటూ సామాన్య మానవుడు కామెంట్ చేస్తున్నాడు. క్రేజీగా మన మహేష్ రెస్టారెంట్ కదా అని అందులోకి అడుగుపెట్టినవాళ్ళకి జేబులు ఖాళీ అవ్వాల్సిందేనట. ఒకవేళ ఫ్యామిలీతో కలిసి మహేష్ రెస్టారెంట్ లోకి అడుగుపెడితే ఓ 1000 కి బిల్లు కట్టకుండా బయటకు రాలేరు అంటూ సోషల్ మీడియాలో మహేష్-నమ్రతల రెస్టారెంట్ పై కామెంట్స్ జొప్పిస్తున్నారు. ఇంకొంతమంది సూపర్ స్టార్ అంటే అంత ఈజీ కాదురా అంటున్నారు.

Mahesh Babu Restaurant Menu And Rates:

Mahesh Babu and Namrata AN Restaurant Menu And Rates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs