బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 5 లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ అనూహ్యంగా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. చంటి, సూర్య, గీతూ రాయల్ లాంటి వాళ్ళను టాప్ 5 అనుకున్నారు. కానీ వాళ్ళు మిడిల్ వీక్స్ లోనే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఎవ్వరి ఎలిమినేషన్ ఎలా ఉన్న గీతూ రాయల్ ఎలిమినేషన్ మాత్రం చాలామందికి షాక్ ఇచ్చింది. అస్సలు గీతూ ఊహించనైనను లేదు తాను ఎలిమినేట్ అవుతాను అని. అందుకే ఆ బాధను తట్టుకోలేక బిగ్ బాస్ ని వదల్లేక ఏడ్చింది చూడండీ.. అమ్మో ఆమె ఏడుపు చూసి చాలామంది ఎమోషనల్ అయ్యే ఉంటారు. బిగ్ బాస్ ఎలిమినేషన్ స్టేజ్ పై ఏడవడమే కాదు, ఆమె ఓ వీడియో చేసింది, ఆ వీడియోలోను బిగ్ బాస్ నుండి వచ్చేసినందుకు తెగ ఏడ్చింది.
అలాగే ఆమె బిగ్ బాస్ సీజన్ 6 ఫ్యామిలీ ఎపిసోడ్స్ చూస్తూ ఏడుస్తున్న వీడియోని ఆమె కుటుంబం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతలా ఏడ్చిన గీతూ తాజాగా స్టార్ మాలో జరిగిన ఓ ప్రొగ్రాంలోను కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రాంలో బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినవారందరిని శ్రీముఖి యాంకరింగ్ లో ఓ ఆట ఆడించారు. వాసంతి-నేహా చౌదరి -అభినయ లు డాన్స్ పెరఫార్మెన్స్ తో దుమ్మురేపగా.. అర్జున్ కళ్యాణ్, సూర్యలను ప్రతి ఒక్కళ్ళు ఆడుకున్నారు. ఆరోహితో సూర్య బాండింగ్, శ్రీ సత్యని లింక్ చేస్తూ అర్జున్ కళ్యాణ్ ని ఆటపట్టించారు.
చంటి జబర్దస్త్ జోక్ లతో ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రాం అదిరిపోగా.. శ్రీముఖి గీతూ పాతగాయాన్ని మళ్ళీ కెలికింది. బిగ్ బాస్ లో కొన్ని ఎలిమినేషన్స్ చాలా బాధని కలిగిస్తాయని, దాని నుండి చాలామంది తేరుకోలేరంటూ గీతూ ని ఉద్దేశించి చెప్పగా.. అది ఎప్పుడు గుర్తొచ్చినా నాకు ఏడుపు ఆగదు, అస్సలు అనుకోలేదు అంత త్వరగా ఎలిమినేట్ అవుతాను అని, దానిని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉన్నాను, రజినీకాంత్ నీలాంబరి మాదిరి కొన్నిరోజులు నా ఓటమిని తలుచుకుంటూ కుంగిపోయాను, బిగ్ బాస్ నుండి ఎలిమినేటి అయ్యాక బయటకూడా కనిపించలేదు అంటూ భోరుమంది. అది చూసిన నెటిజెన్స్ అమ్మా గీతూ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మరొక వారంలో ఉంది.. ఇప్పటికీ ఆ ఏడుపు ఆపవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.