పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ ప్లేస్‌లో.. ఇదే కాంబినేషన్‌లో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘థేరి’ రీమేక్ చేయబోతున్నట్లుగా గురువారం వార్తలు వైరల్ అయ్యాయి. హరీష్ శంకర్ కూడా తన ట్విట్టర్ వేదికగా.. ఓ ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతుంది అంటూ పవన్ కల్యాణ్, మైత్రీ మూవీ మేకర్స్, డీఎస్పీ, బోస్, ఆనందసాయిలను ట్యాగ్ చేశాడు. దీంతో అంతా ‘భవదీయుడు భగత్‌సింగ్’ అప్‌డేట్ అని అనుకున్నారు. కానీ, కొందరు ‘థేరీ రీమేక్’ అంట అని ప్రచారం స్టార్ట్ చేశారు. ఇప్పటికే ‘కాటమరాయుడు’ వంటి సినిమా విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. మళ్లీ అలాంటి తరహా సినిమా అనగానే.. (‘థేరి’ సినిమా కూడా ‘పోలీసోడు’గా తెలుగులో విడుదలైంది) ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోయింది. దీంతో మాకొద్దు బాబోయ్ థేరీ రీమేక్ అంటూ ఓ ట్యాగ్‌ని ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు.
ఈ ప్రాసెస్‌లో కొందరు హరీష్ శంకర్‌పై దూషణలకు కూడా దిగారు. ఇంకొందరైతే.. థేరి రీమేక్ కనుక చేస్తే సూసైడ్ చేసుకుంటామని కూడా ట్వీట్స్, లెటర్స్ స్టార్ట్ చేశారు. ఈ టార్చర్ తట్టుకోలేక.. హరీష్ శంకర్ కొందరిని బ్లాక్ చేస్తూ వచ్చాడు. బ్లాక్ చేసిన మెసేజ్‌లని కూడా స్క్రీన్ షాట్స్ తీసి ఫ్యాన్స్ షేర్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. అసలు హరీష్ శంకర్ చెప్పాలనుకున్న ఎగ్జయిట్‌మెంట్ వార్త ఏమిటనేది.. ఎవరికీ తెలియదు. చెప్పే వరకు కూడా ఆగకుండా.. ట్రోల్స్ మొదలెట్టారు. ‘థేరి’ రీమేక్ కాదంటలే.. అని కొందరు మెగా ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. ఆ ట్యాగ్ మాత్రం ట్రెండ్‌లో నుంచి దిగలేదు. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు అంటూ.. పవన్ కల్యాణ్‌కు చేరేలాగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారంటే.. ఏ రేంజ్‌లో ‘థేరి’ వారిని డిస్టర్బ్ చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హరీష్ శంకర్‌ని.. ఫ్యాన్స్ భయపెట్టేశారన్నది మాత్రం వాస్తవం. హరీష్ ఇక ఏ అప్‌డేట్ ఇస్తారో.. చూడాలి.