Advertisement
Google Ads BL

పవన్, ఎన్టీఆర్.. ఎవరు చేసినా హిస్టరీనే!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. లేదంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వీరిద్దరిలో ఎవరు ‘గాడ్సే’ చిత్రం చేసినా.. ఆ సినిమా చరిత్ర సృష్టించేదని అన్నారు నిర్మాత సి. కల్యాణ్. డిసెంబర్ 9 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం ఆయన ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించారు. ఈ సమావేశంలో.. తను నిర్మించిన ‘గాడ్సే’ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదని.. ఆయన నిరాశను వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఆ సినిమా విషయంలో.. ముఖ్యంగా హీరో విషయంలో వేరే వారిని పెట్టాలని అనుకున్నానని, కానీ అప్పటికే హీరో ఫిక్స్ అవడంతో ఏమీ చేయలేకపోయానని తెలిపారు. ఈ సినిమాపై ఆయన మాట్లాడుతూ.. 

Advertisement
CJ Advs

 

‘‘గాడ్సే సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. అది మంచి సినిమానే. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అయితే ప్రేక్షకులు ఓటీటీలో చూసినంతగా.. థియేటర్లలో చూడలేదు. థియేటర్లలో రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేశామేమో. అయితే ఆ కథని మోయగలిగే ఆర్టిస్ట్ కావాలి. ఈ సంగతి దర్శకుడికి కూడా ముందే చెప్పాను. అయితే అప్పటికే హీరోని ఫిక్స్ చేసేశాం. ఆ కథని, అందులో ఉన్న కంటెంట్‌ని మోయగలిగేది తెలుగులో ఇద్దరే ఇద్దరు. ఒకటి పవన్ కళ్యాణ్, రెండవ హీరో జూ. ఎన్టీఆర్. ఈ ఇద్దరిలో ఎవరు చేసినా.. గాడ్సే హిస్టరీ క్రియేట్ చేసేది. బాగా చదువుకున్నా.. ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్, అలాగే వారి తల్లితండ్రులందరికీ ఈ సినిమా రీచ్ అవుతుందని భావించాం. కానీ అవ్వలేదు. గాడ్సే రిజల్ట్ చూసి చాలా బాధపడ్డాను. అయితే ఈ సినిమా ఎక్కడా రాజీపడకుండా తీశాం. ఏ విషయంలోనూ వెనకడుగు వేయలేదు. సత్యదేవ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో చేసిన సినిమా ‘గాడ్సే’. కానీ వర్కవుట్ కాలేదు..’’ అని సి. కల్యాణ్ చెప్పుకొచ్చారు.

C Kalyan Sensational Comments on Godse Movie:

Had Pawan Kalyan or NTR acted, Godse would have created history
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs