Advertisement
Google Ads BL

‘థేరి’.. బండ్ల గణేష్ భలే వాడేస్తున్నాడు


‘WeDontWantTheriRemake’.. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోన్న ట్యాగ్ ఇది. ఏ రేంజ్‌లో ట్యాగ్ అవుతుందంటే.. నిర్మాత కానీ, దర్శకుడు కానీ ఈ ట్యాగ్ చూస్తే భయపడిపోయేంతగా ట్రెండ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక వైపు పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే, పార్టీని నడిపేందుకు గ్యాప్ లేకుండా సినిమాలు అంగీకరిస్తున్నారు. సినిమాలకు సైన్ అయితే చేస్తున్నారు కానీ.. ఆ సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లే విషయంలో మాత్రం.. చాలా సమయం తీసుకుంటున్నారు. అందుకు కారణం ఏమిటో తెలియంది కాదు. తాజాగా ఆయన సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమాకి సైన్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ ప్రకటన తర్వాత హరీష్ శంకర్ సినిమా ఏమైందంటూ ప్రజర్ ఎక్కువవుతోన్న తరుణంలో.. ఎగ్జైటింగ్ న్యూస్ వచ్చేస్తోంది అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. అయితే అంతకు ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా కాకుండా.. ‘థేరీ’ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లుగా ప్రకటన రాబోతోందని హింట్స్ వస్తుండటంతో.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ ‘మాకొద్దు థేరీ రీమేక్’ అనే ట్యాగ్‌తో నిరసన వ్యక్తం చేయడమే కాకుండా లెటర్స్ కూడా రాస్తున్నారు. కొందరైతే సూసైడ్ చేసుకుంటామని కూడా రియాక్ట్ అవుతున్నారు. 

Advertisement
CJ Advs

 

ఈ మూమెంట్‌ని బండ్ల గణేష్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటే బండ్ల గణేష్.. మరోసారి పవన్ కల్యాణ్ అభిమానుల అటెన్షన్‌ను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సుజీత్ సినిమా వేరే నిర్మాతకు వెళ్లిపోయిందనే బాధలో ఉన్న బండ్లకు.. ఫ్యాన్స్ నిరసనతో మళ్లీ ఊపొచ్చింది. ఫ్యాన్స్ ట్వీట్స్‌కు రిప్లయ్ ఇస్తూ.. ‘‘బ్రదర్స్ కాస్త ఆగండి.. ఈ తరహా లెటర్స్ వద్దు. మీ అందరినీ నేను ప్రామిస్ చేస్తున్నాను. మన బాస్ పవన్ కల్యాణ్‌గారితో ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ నేను కొట్టి చూపిస్తాను. కృషితో నాస్తి దుర్భిక్షం అప్పటి మాట.. కసితో నాస్తి బ్లాక్ బాస్టర్ ఇప్పటి మాట’’ అంటూ ట్వీట్స్ కుమ్ముతున్నాడు. ఏదైనా బండ్లన్న స్కెచ్చే వేరు. అయితే హరీష్ శంకర్ నుంచి అసలు ఎటువంటి అప్‌డేట్ రాబోతుందనేది మాత్రం.. ఇంకా తెలియాల్సి ఉంది.

Pawan Kalyan Fans Angry on Pawan Kalyan Theri Remake:

Bumper offer from Bandla Ganesh for Pawan Kalyan fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs