Advertisement
Google Ads BL

రామానుజాచార్య గా బాలయ్య


బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. వీరసింహ రెడ్డి షూటింగ్ ముగించిన రెండోరోజే అనిల్ రావిపూడి తో NBK108 ని అఫీషియల్ గా మొదలు పెట్టి సెట్స్ మీదకి వెళ్లిపోయారు. యాక్షన్ పార్ట్ ఎపిసోడ్ తో NBK108 రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. ఈ సినిమాని అనిల్ రావిపూడి క్రేజీ మూవీగా తెరకెక్కిస్తున్నారు. అభిమానులకి బాలయ్యని కొత్తగా చూపిస్తాను, ఈ సినిమాతో మీ అంచనాలను అందుకుంటాను అంటూ ప్రామిస్ కూడా చేసారు. ఇక బాలయ్య తన తదుపరి మూవీ ని ఆయన ప్రకటించకపోయినా నిర్మాత సి కళ్యాణ్ అధికారికంగా రివీల్ చేసారు.

Advertisement
CJ Advs

నందమూరి బాలకృష్ణ గారితో రామానుజాచార్య ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకర తో కలసి చినజీయర్ స్వామి వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను.. అంటూ నిర్మాత సి కళ్యాణ్ ఆయన బర్త్ డే రోజున ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పడం బాలయ్య ఫాన్స్ ని ఆకర్షించింది. 

అఖండ గా గర్జించిన బాలయ్య రామానుజాచార్యగా ఆ ప్రశాంతతని ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది.

Nandamuri Balakrishna As Ramanujacharya:

Plans Are On For NBK Global Project Ramanujacharya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs