బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి దగ్గరైంది. ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన 6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం అప్పుడే ఏర్పాట్లని మొదలు పెట్టేసారు స్టార్ మా యాజమాన్యం. అయితే ఇప్పటివరకు జరిగిన సీజన్స్ ఒక ఎత్తు, ఈ ఆరో సీజన ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 6 పై బుల్లితెర ప్రేక్షకులు నిరాశ పడిపోతున్నారు. ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఫైమా ని కామెడీ చెయ్యమంటే వెటకారం చేసింది. చంటి కామెడీ మానేసి సీరియస్ గా కనిపించాడు. శ్రీహన్, సూర్య ఏదో ఎంటర్టైన్మెంట్ చేసినా అంత ఉపయోగం లేదు. గీతూ రాయల్ ఏదో చెయ్యాలనుకుంటే ఏదో అయ్యింది.
ఇక ఈ సీజన్ లో అడుగుపెట్టిన చాలామంది కంటెస్టెంట్స్ టాస్క్ ఆడితే చాలు ఫెమస్ అవుతామని, పోట్లాడితే చాలు ఫైనల్ కి వెళతామని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చారు. ఈ వారం ఓటింగ్ రిజల్ట్ లో చాలా ట్విస్ట్ లు కనబడుతున్నాయి. ఆది రెడ్డి vs శ్రీ సత్య vs కీర్తి ఈ ముగ్గురిలో ఈవారం ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో కాస్త గందర గోళం నడుస్తుంది. ఎందుకంటే లాస్ట్ డేంజర్ జోన్ లో ఓ రోజు శ్రీ సత్య-కీర్తి ఉంటే, ఓ రోజు ఆది రెడ్డి, కీర్తి ఉంటున్నారు. సో ఏ ఇద్దరు సభ్యులు ఈ వారం ఎలిమినేట్ అవుతారనే విషయంలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఇక రేవంత్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంటే.. రోహిత్ సెకండ్ ప్లేస్ లో ఉంటున్నాడు. ఇక ఎపిసోడ్ ఎపిసోడ్ కి లెక్కలు మారుతున్నట్టుగా కనబడుతుంది. ఇనాయా సుల్తానా మూడో స్థానంలో నిలిచినట్లు సమాచారం. అనూహ్యంగా శ్రీ సత్య నాలుగో స్థానంలో ఆది రెడ్డి ఐదో స్థానంలో ఉండగా, కీర్తి భట్ ఆరో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టాప్ 5 లో శ్రీహన్ చోటు సంపాదించి రిలాక్స్ అవుతున్నాడు.