బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇప్పటివరకు ప్రేమలో పడినట్లు కానీ, వారితో, వీరితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం చాలా అరుదుగా వినిపిస్తాయి. పలు భాషల సినిమాలతో బిజీగా షూటింగ్స్ చేసుకుంటూ ఖాళీ సమయంలో పేరెంట్స్ తో వెకేషన్స్ ని ఎంజాయ్ చేసే పూజ హెగ్డే.. ఇప్పుడు ప్రేమలో పడింది అనే న్యూస్ బి టౌన్ లో వినిపిస్తుంది. అయితే పూజ ప్రేమలో పడింది అని చెప్పడం కన్నా, సల్మాన్ ఖాన్ ప్రేమలో పడ్డాడు.. అది కూడా బుట్ట బొమ్మ ప్రేమలో తరిస్తున్నాడనే న్యూస్ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
పూజ హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పటివరకు లెక్కకి మించిన హీరోయిన్స్ తో డేటింగ్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోకపోయినా.. ఇలాంటి ఎఫ్ఫైర్స్ తో హైలెట్ అయ్యే సల్మాన్ ఖాన్ ఇప్పుడు పూజ హెగ్డే ప్రేమలో ఉన్నాడంటూ కాంట్రవర్సీ కింగ్ ఉమైర్ సందు ట్వీట్ చేసాడు. ఉమైర్ చెప్పేవి ఎవ్వరూ నమ్మరు, కానీ ఒక్కోసారి అతని ట్వీట్స్ ఇలా వైరలవుతుంటాయి.
తాజాగా ఉమైర్ సందు పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ మధ్య ఎఫ్ఫైర్ కొనసాగుతోందని, బుట్టబొమ్మ పూజ ప్రేమలో సల్మాన్ పడిపోయాడని చెప్పడమే కాదు ప్రస్తుతం పూజ-సల్మాన్ కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని, అంతేకాకుండా పూజ హెగ్డే కి సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ మరో రెండు సినిమాల్లో అవకాశం ఇస్తున్నారని చెబుతున్నాడు. సల్మాన్ కి అంత్యంత సన్నిహితులే ఈ విషయాన్ని బయటపెట్టారంటూ ఉమైర్ చేసిన ఈ తుప్పాసి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.